Manamey 2 Days Collections: అనుకున్న దానికంటే ఎక్కువగా.. మనమేకు భారీ వసూళ్లు.. 2 రోజుల్లో ఎంతంటే!

విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో స్పెషల్ ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు చార్మింగ్ స్టార్ శర్వానంద్. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసే అతడు.. 'ఒకే ఒక జీవితం'తో మళ్లీ సక్సెస్ బాటలోకి వచ్చాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఈ టాలెంటెడ్ హీరో 'మనమే' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో శర్వానంద్ 'మనమే' మూవీ రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

ఫీల్ గుడ్ స్టోరీతో వచ్చిన మూవీ
టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రమే 'మనమే'. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. వెన్నెల కిశోర్, సీరత్ కపూర్, రాహుల్ రవీంద్రన్ తదితరులు కీలక పాత్రలు చేశారు. దీనికి హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని సమకూర్చాడు.

Sharwanand Starrer Manamey Movie 2 Days Worldwide Collections Details

మనమే మూవీ బిజినెస్ ఇలా
శర్వానంద్ హీరోగా చేసిన 'మనమే' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 3.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.50 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 11.50 కోట్లు బిజినెస్ జరిగింది.

2వ రోజు అలా.. మొత్తంగా
శర్వానంద్ హీరోగా.. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఫీల్ గుడ్ మూవీ 'మనమే'కు రెండో రోజు కూడా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.20 కోట్లు షేర్ వసూలు అయింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలకు కలిపి రూ. 1.60 కోట్లు వచ్చాయి. ఇలా రెండు రోజుల్లో ఇది రూ. 3.40 కోట్లు రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X