Manamey 4 Days Collections: ఒక్కసారిగా డౌన్.. 4 రోజుల్లో మాత్రం భారీగా.. శర్వానంద్ హిట్ కొట్టాలంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనను కనబరుస్తూ కొందరు హీరోలు ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో శర్వానంద్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ తనదై చిత్రాలతో అలరిస్తూ వస్తోన్న ఈ కుర్రాడు.. 'ఒకే ఒక జీవితం' ఇచ్చిన హిట్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలన్న లక్ష్యంతో 'మనమే' అనే మూవీ చేశాడు. ఫీల్ గుడ్ స్టోరీతో రూపొందిన ఈ మూవీకి మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా బాగానే లభిస్తోంది. అయితే, వర్కింగ్ డేలో కాస్త డౌన్ అయింది. మరి 'మనమే' మూవీ నాలుగు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!
మనమే అంటూ వచ్చేశాడు
టాలీవుడ్ చార్మింగ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రమే 'మనమే'. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. వెన్నెల కిశోర్, సీరత్ కపూర్, రాహుల్ రవీంద్రన్ తదితరులు కీలక పాత్రలు చేశారు. దీనికి హేషామ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

మనమే మూవీ బిజినెస్ ఇలా
శర్వానంద్ నటించిన 'మనమే' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 3.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.50 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 11.50 కోట్లు బిజినెస్ జరుపుకుంది.
4వ రోజు డౌన్.. మొత్తంగా
చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన 'మనమే' మూవీకి వర్కింగ్ డే కావడంతో సోమవారం రెస్పాన్స్ ఒకసారిగా డౌన్ అయింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ సినిమా రూ. 80 లక్షలు వరకూ షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 1 కోటి రాబట్టింది. ఇలా శర్వానంద్ సినిమా నాలుగు రోజుల్లో రూ. 6.35 కోట్లు వరకూ వసూలు చేసుకుంది.


Click it and Unblock the Notifications











