Manamey 5 Days Collections: శర్వానంద్‌కు షాక్.. 5 రోజుల్లో ఊహించని విధంగా.. మనమే హిట్ కావాలంటే!
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండానే వచ్చినా.. తనదైన నటనతో తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు టాలెంటెడ్ హీరో శర్వానంద్. మొదటి నుంచీ విభిన్నమైన సినిమాలతో సత్తా చాటుతోన్న అతడు.. హిట్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలన్న పట్టుదలతో తాజాగా 'మనమే' అనే చిత్రంతో వచ్చాడు. ఫీల్ గుడ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకు డీసెంట్ టాక్ రావడంతో వీకెండ్‌లో సత్తా చాటింది. కానీ, వీక్ డేస్‌లో మాత్రం డౌన్ అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 'మనమే' మూవీ ఐదు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!
ఫీల్ గుడ్ స్టోరీతో వచ్చాడు
చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన తాజా సినిమానే 'మనమే'. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. వెన్నెల కిశోర్, సీరత్ కపూర్, రాహుల్ రవీంద్రన్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని సమకూర్చాడు.

మనమే మూవీ బిజినెస్ ఇలా
శర్వానంద్ హీరోగా చేసిన 'మనమే' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 3.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.50 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 11.50 కోట్లు బిజినెస్ చేసుకుంది.
5వ రోజూ డౌన్.. మొత్తంగా
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన 'మనమే' మూవీకి వీకెండ్ తర్వాత రెస్పాన్స్ డౌన్ అవుతూనే ఉంటోంది. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు పడిపోతున్నాయి. ఇలా ఐదో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 40 లక్షలు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలిపి రూ. 50 లక్షలు రాబట్టింది. ఇలా ఇప్పటి వరకూ రూ. 6.50 కోట్లు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











