Manamey Day 1 Collections: శర్వానంద్ మూవీ సర్‌ప్రైజ్.. మొదటి రోజు షాకింగ్ కలెక్షన్లు.. ఆ సినిమా కంటే!

టాలీవుడ్‌లో కొందరు హీరోలు సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తూ మంచి పేరును తెచ్చుకున్నారు. అలాంటి వారిలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ ఒకడు. విలక్షణమైన నటనతో ఆరంభం నుంచీ తనదైన చిత్రాలను చేస్తూ అలరిస్తోన్న అతడు.. చాలా గ్యాప్ తర్వాత 'ఒకే ఒక జీవితం'తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు.

ఈ ఊపులోనే ఇప్పుడు 'మనమే' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి డీసెంట్ టాక్ వచ్చింది. కానీ, ఆడియెన్స్ రెస్పాన్స్ అంతగా రాలేదు. ఈ నేపథ్యంలో 'మనమే' మూవీ మొదటి రోజు ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

Sharwanand Starrer Manamey Movie Day 1 Worldwide Collections Details

మనమే అంటూ వచ్చేశాడు
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రమే 'మనమే'. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. వెన్నెల కిశోర్, సీరత్ కపూర్, రాహుల్ రవీంద్రన్ తదితరులు కీలక పాత్రలు చేశారు. దీనికి హేషామ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించాడు.

మనమే మూవీ బిజినెస్ ఇలా
శర్వానంద్ నటించిన 'మనమే' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 3.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.50 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 11.50 కోట్లు మేర బిజినెస్ అయింది.

Sharwanand Starrer Manamey Movie Day 1 Worldwide Collections Details

డీసెంట్‌ టాక్‌తో తక్కువగా
ఫీల్ గుడ్ ఎమోషనల్ స్టోరీతో రూపొందిన 'మనమే' మూవీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మోస్తరు ఓపెనింగ్స్‌నే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

Sharwanand Starrer Manamey Movie Day 1 Worldwide Collections Details

తొలి రోజు ఎంత వచ్చింది
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన 'మనమే' మూవీకి డీసెంట్ టాక్ లభించింది. కానీ, మొదటి రోజు ఇది ప్రేక్షకులను థియేటర్లలకు రప్పించడంలో అంతగా సక్సెస్ కాలేదు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1 కోటి షేర్ మాత్రమే వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలనూ కలుపుకుని ఈ సినిమా రూ. 1.60 కోట్లు కలెక్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X