Manamey Business: మనమే మూవీకి రికార్డు బిజినెస్.. అన్ని కోట్లు వస్తేనే శర్వానంద్‌కు హిట్

స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన విలక్షణమైన నటనతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోల్లో శర్వానంద్ ఒకడు. ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న ఈ యంగ్ హీరో.. 'ఒకే ఒక జీవితం'తో హిట్ ట్రాక్ ఎక్కాడు.

ఈ ఊపులోనే ఇప్పుడు 'మనమే' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగింది? ఏ మేర వసూలు చేస్తే ఈ సినిమా విజయాన్ని అందుకుంటుంది? అనేవి చూద్దాం పదండి!

Sharwanand Starrer Manamey Movie Pre Release Business and Theaters Count Details

మనమే అంటూ వస్తున్నాడు
టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రమే 'మనమే'. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. వెన్నెల కిశోర్, సీరత్ కపూర్, రాహుల్ రవీంద్రన్ తదితరులు కీలక పాత్రలు చేశారు. దీనికి హేషామ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

Sharwanand Starrer Manamey Movie Pre Release Business and Theaters Count Details

అలాంటి కథ.. ఎమోషనల్

ఎమోషన్స్ అనేవి లేని ఓ కుర్రాడి లైఫ్‌లోకి ఒక అమ్మాయితో పాటు బాబు ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత నుంచి అతడి జీవితంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరగడం.. వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అనే అంశాలతో తెరకెక్కిన చిత్రమే 'మనమే'. ఈ మూవీ లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

Sharwanand Starrer Manamey Movie Pre Release Business and Theaters Count Details

ప్రమోషన్స్‌తో సందడిగా
పూర్తి స్థాయి ఎమోషనల్ ఫ్యామిలీ స్టోరీతో రూపొందిన 'మనమే' సినిమాను జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లు, ఇంటర్వ్యూలు కూడా జరిగాయి. వీటన్నింటికి ఎవరూ ఊహించని రీతిలో రెస్పాన్స్ లభించింది.

మనమేకు షాకింగ్‌ బిజినెస్

శర్వానంద్ నటించిన 'మనమే' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 3.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.50 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 11.50 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

Sharwanand Starrer Manamey Movie Pre Release Business and Theaters Count Details

అన్ని కోట్లు వస్తేనే హిట్
శర్వానంద్ వేగంగా సినిమాలు చేయడం లేదు. అయినప్పటికీ 'మనమే' మూవీకి బిజినెస్ రికార్డు స్థాయిలోనే జరిగింది. ఇక, ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 11.50 కోట్లు బిజినెస్‌ను జరుపుకుంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12.00 కోట్లుగా నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Sharwanand Starrer Manamey Movie Pre Release Business and Theaters Count Details

అన్ని థియేటర్లలో రిలీజ్

'మనమే' మూవీకి ఓవరాల్‌గా థియేటర్లు మంచిగానే లభించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాం, ఆంధ్రా ప్రాంతంలోని అన్ని ఏరియాల్లో కలిపి 480 థియేటర్లలో విడుదల కాబోతుంది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌ ఏరియాలను కలిపి ప్రపంచ వ్యాప్తంగా 650 వరకూ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X