Sreekaram Total Collections: శర్వానంద్‌కు భారీ షాక్.. 17 కోట్ల బిజినెస్.. వచ్చింది మాత్రం ఇంతే!

కావాల్సినంత టాలెంట్ ఉన్నా.. సరైన విజయాలను అందుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నాడు యంగ్ హీరో శర్వానంద్. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తోన్న అతడు.. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఘోరా పరాజయాలను చవి చూశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో 'శ్రీకారం' అనే సినిమా చేశాడు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో నడిచింది. కలెక్షన్ల పరంగా మాత్రం నిరాశనే మిగిల్చింది. ఇక, ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్ల రిపోర్టును పరిశీలిస్తే....

విజయానికి ‘శ్రీకారం' చుట్టాలని వచ్చిన శర్వా

విజయానికి ‘శ్రీకారం' చుట్టాలని వచ్చిన శర్వా

శర్వానంద్ హీరోగా కిశోర్ రెడ్డి అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన చిత్రమే 'శ్రీకారం'. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట దీన్ని నిర్మించారు.టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

ఆ ఫిల్మ్ ఆధారంగా వచ్చింది.. మంచి సందేశం

ఆ ఫిల్మ్ ఆధారంగా వచ్చింది.. మంచి సందేశం

కిశోర్ రెడ్డి కొన్నేళ్ల క్రితం 'శ్రీకారం' అనే షార్ట్ ఫిల్మ్ రూపొందించాడు. వ్యవసాయ రంగంలోని సమస్యలపై తీసిన దీనికి మంచి స్పందన వచ్చింది. విమర్శకులు సైతం ప్రశంసించేలా దీన్ని తెరకెక్కించాడు. ఇది చూసిన తర్వాతనే నిర్మాతలు అతడికి అవకాశం కల్పించారు. ఈ ఫిల్మ్ ఆధారంగానే వ్యవసాయం గొప్పదనం చూపించేందుకు అదే టైటిల్‌తో 'శ్రీకారం' సినిమాను తీశాడు.

అంచనాలు భారీగా.. శర్వానంద్ కెరీర్‌లోనే ఫస్ట్

అంచనాలు భారీగా.. శర్వానంద్ కెరీర్‌లోనే ఫస్ట్

'శ్రీకారం' మూవీపై మొదట్లో అంచనాలు లేకున్నా.. టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత పరిస్థితి మారిపోయింది. దీంతో శర్వానంద్ కెరీర్‌లోనే తొలిసారి దీనికి భారీగా బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 5.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.40 కోట్లు, ఆంధ్రాలో రూ. 8 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటితో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ బిజినెస్ రూ. 17.10 జరిగినట్లు తెలుస్తోంది.

ఏపీ, టీఎస్‌లో ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

ఏపీ, టీఎస్‌లో ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

'శ్రీకారం' మూవీకి మొదటి నుంచీ మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లు ఓ మోస్తరుగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.86 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.66 కోట్లు ఉత్తరాంధ్రలో రూ. 1.21 కోట్లు, ఈస్ట్‌లో రూ. 74 లక్షలు, వెస్ట్‌లో రూ. 50 లక్షలు, గుంటూరులో రూ. 99 లక్షలు, కృష్ణాలో రూ. 53 లక్షలు, నెల్లూరులో రూ. 32 లక్షలతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.82 కోట్లు వచ్చాయి.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అంతగా రాబట్టలేకపోయిన 'శ్రీకారం'.. మిగిలిన ప్రాంతాల్లోనూ ప్రభావం చూపలేకపోయింది. ముగింపు సమయానికి రెండు రాష్ట్రాల్లో రూ. 8.82 కోట్లు వసూలు చేయగా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 28 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 54 లక్షలు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా శర్వానంద్ చిత్రం రూ. 9.64 కోట్లు షేర్, రూ. 16.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వసూలు చేసిందెంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వసూలు చేసిందెంత?

ప్రపంచ వ్యాప్తంగా 'శ్రీకారం' మూవీ బిజినెస్ రూ. 17.10 జరగగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17.50 కోట్లుగా నమోదైంది. అయితే, ఈ సినిమా ముగింపు సమయానికి అన్ని ప్రాంతాల్లో కలుపుకుని రూ. 9.64 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఫలితంగా రూ. 7.86 కోట్లు నష్టాలను మిగుల్చుకుంది. దీంతో ఈ ఏడాది విడుదలైన వాటిలో డిజాస్టర్ మూవీగా అప్రతిష్టను మూటగట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X