Shashtipoorthi Business: షష్టిపూర్తి బడ్జెట్, బిజినెస్ ఎన్ని కోట్లు? మూవీ లాభాల్లోకి రావాలంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా పరిచయం అవుతూ రూపేశ్ స్వీయ నిర్మాణంలో రూపొందించిన చిత్రం షష్టిపూర్తి. నట కిరీటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటి లేడీస్ టైలర్ ఫేమ్ అర్చన, యువ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పవన్ ప్రభ తెరకెక్కించారు. మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం మే 30న విడుదల కానున్నది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? థియేట్రికల్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
షష్టిపూర్తి సినిమా విషయానికి వస్తే.. టాప్ యాక్టర్లు, టాప్ టెక్నిషియన్స్ పనిచేశారు. దర్శకుడు పవన్ ప్రభ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమాకు పూర్తిగా న్యాయం చేయాలనుకొన్నాను. అందుకే ఖర్చుకు వెనుకాడకుండా రాజేంద్ర ప్రసాద్, అర్చన లాంటి జంటను మళ్లీ 35 ఏళ్ల తర్వాత కలిపాను. అలాగే కథలో ఉండే బలానికి సాంకేతిక హంగులు అంతే బలంగా ఉండాలని అనుకొన్నాను. అందుకే ఇళయ రాజా మ్యూజిక్, తోట తరణి ఆర్ట్స్ కీరవాణి, చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించేలా చేశాను. మేము అనుకొన్న బడ్జెట్ పెరిగినా క్వాలిటీ కోసం రాజీపడలేదు అని నిర్మాత రూపేశ్ అన్నారు.

షష్టిపూర్తి సినిమాకు లెజెండ్స్ పనిచేయడంతో బడ్జెట్ భారీగానే పెరిగింది. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు మొత్తంగా 20 కోట్ల రూపాయల మేర అయింది. అయితే ఈ సినిమా కోసం పెట్టిన ఖర్చుకు సమానంగా బిజినెస్ వర్గాల నుంచి వచ్చిన ఆఫర్లు కూడా మాకు సంతృప్తిని ఇచ్చాయి. ఈ సినిమా కోసం భారీ ఆఫర్లు వచ్చాయి అని హీరో, నిర్మాత రూపేశ్ వెల్లడించారు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా డిజిటల్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ కోసం ప్రముఖ సంస్థలు పోటీపడ్డాయి. పలు సంస్థలు ఆఫర్లు ఇచ్చినప్పటికీ.. తాము అచీతూచీ వ్యవహరించాం. ఓటీటీ రైట్స్‌కు ఫ్యాన్సీ రేటు వచ్చింది.అలాగే ఇళయరాజా మ్యూజిక్ అందించడం వల్ల ఆ రైట్స్‌లో సగభాగం మా అయి సంస్థ ఉంచుకొన్నది.జంగ్లీ మ్యూజిక్ సంస్థకు కొన్ని సంవత్సరాలపాటు రాయల్టీ చెల్లించే విధంగా ఒప్పందం కుదిరింది అని రూపేశ్ తెలిపారు.
ఇక ఈ సినిమా ప్రోమోలు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ భారీ అంచనాలు, బజ్ క్రియేట్ చేశాయి. దాంతో ఈ మూవీని ఏపీ, తెలంగాణలో సముచితంగా ఉండేలా ఓ మోతాదు సంఖ్యలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు వస్తున్న డిమాండ్ మేరకు ఆంధ్రా, నైజాంలో కలిపి 250 నుంచి 300 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం. తక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేసి మౌత్ టాక్ ద్వారా స్క్రీన్ల సంఖ్యను పెంచాలనే ప్లాన్ చేశాం. ఇండియాలో రిలీజ్ అనంతరం వారం తర్వాత ఓవర్సీస్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించాం అని రూపేశ్ చెప్పారు.
ఇక షష్టిపూర్తి సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. నాన్ థియేట్రికల్ నుంచి వసూళ్లను మినహాయించిన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ లక్ష్యం ఈ విధంగా ఉంది. ఈ సినిమా ఇండియాలో 5 కోట్ల షేర్, 8 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్లాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.ఈ సినిమా రానున్న రోజుల్లో ఎలాంటి వసూళ్లను, ఫలితాలను సొంతం చేసుకొంటుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











