Shehzada day 1 collections అలవైకుంఠపురం కలెక్షన్లను బీట్ చేస్తుందా? తొలి రోజు ఆర్యన్ కార్తీక్ మూవీకి ఎన్ని కో
తెలుగులో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన అల వైకుంఠపురంలో సినిమాకు రిమేక్‌గా తెరకెక్కించిన షెహజాదా సినిమా పలు వాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ యువ హీరో, హీరోయిన్లు కార్తీక్ ఆర్యన్, కృతిసనన్ జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఓ పక్క పఠాన్ సినిమా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో రిలీజైన షెహజాదా సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?

భూల్ భులయ్యా సినిమా భారీ విజయం తర్వాత
షెహజాదా సినిమాకు ముందు కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భులయ్యా సినిమా భారీ విజయాన్ని అందుకొన్నది. ట్రేడ్ వర్గాలను అంచనాలను మంచి ఆ సినిమా కలెక్షన్లు సాధించింది. 2022 సంవత్సరంలో హిందీ సినిమా ఇండస్ట్రీలో భారీ విజయం అందుకొన్న చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. భూల్ భులయ్యా సినిమా అందించిన విజయంతో షెహజాదా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

యాంట్ మ్యాన్, పఠాన్‌తో పోటీ పడుతూ
కార్తీక్ ఆర్యన్, కృతిసనన్ నటించిన షెహజాదా సినిమా విచిత్రమైన పరిస్థితుల్లో థియేట్రికల్ రిలీజైంది. ఓ పక్క పఠాన్, మరో పక్క యాంట్ మ్యాన్ ది వాస్ప్ చిత్రం మధ్య భారీ పోటీని ఈ సినిమా ఎదుర్కొంటున్నది. దాంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్, ఓపెనింగ్స్ అంతంతా మాత్రమే కనిపించాయి.

మిక్స్ డ్ టాక్‌తో షెహజాదా
షెహజాదా సినిమా తొలి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. బాలీవుడ్ సినీ క్రిటిక్స్ ఈ సినిమాపై సానుకూలంగా స్పందించడంతో బజ్ కూడా పాజిటివ్ క్రియేట్ అయింది. అయితే ఈ వారం మహాశివరాత్రి పండుగ రావడం, వీకెండ్‌లో ఈ సినిమా పంజుకొనే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఎంత వసూలు అంటే?
షెహజాదా సినిమా అడ్వాన్స్ బుకింగ్, కరెంట్ బుకింగ్ విషయంలోకి వెళితే.. పీవీఆర్ చైన్ స్క్రీన్లలో 85 లక్షలు, ఐనాక్స్‌లో 48 లక్షలు, సినీ పోలీస్ 3 లక్షలు, సాధించింది. అయితే ఈ సినిమా కలెక్షన్లను యాంట్ మ్యాన్ కలెక్షన్లు అధిగమించేలా ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఎంత రాబట్ట వచ్చంటే?
షెహజాదా సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. తొలి రోజు ఓ మోస్తారు కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి రోజు దేశవ్యాప్తంగా 6 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి రోజు 7.5 కోట్ల నుంచి 8 కోట్ల మధ్య కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











