Shehzada day 2 collections ఒకటి కొంటే మరో టికెట్ ఉచితం.. అయినా షాకింగ్‌గా షెహజాదే కలెక్షన్లు!
అల వైకుంఠపురంలో సినిమా రీమేక్‌గా రూపొందిన బాలీవుడ్ చిత్రం షెహజాదా. బాలీవుడ్ యువ తారలు కార్తీక్ ఆర్యన్, కృతిసనన్ జంటగా నటించిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. తొలి రోజు ఉత్తర భారతంలోని మాస్ పాకెట్స్‌లో భారీ స్పందనను రాబడుతున్నది. అయితే ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఈ సినిమా యాంట్ మ్యాన్, పఠాన్ సినిమాల నుంచి భారీ పోటీ ఎదుర్కొంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో షెహజాదా సినిమా తొలి రోజు కలెక్షన్ల, రెండో రోజు వసూళ్ల అంచనా వివరాల్లోకి వెళితే...

తొలి రోజు అంతంత మాత్రంగానే..
శుక్రవారం అంటే ఫిబ్రవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన షెహజాదా చిత్రం తొలి రోజు పెద్దగా ప్రేక్షకులను రప్పించలేకపోయిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. శనివారం రెండో రోజు మహాశివరాత్రి కావడంతో ఈవెనింగ్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు.

బయ్ వన్.. గెట్ వన్ స్కీమ్
కార్తీక్ ఆర్యన్ నటించిన షెహజాదా సినిమా కలెక్షన్లు తొలి రోజు నిరాశపరిచాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఒక టికెట్ కొంటే.. రెండో టికెట్ ఉచితం అనే స్కీమ్ పెట్టినా ఆడియెన్స్ స్పందించలేదు. నేషనల్ వైడ్‌గా మల్టీప్లెక్స్‌లో తప్పా.. మాస్ పాకెట్స్‌లో ఓ మోస్తారుగా కలెక్షన్లు వచ్చాయి అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

నేషనల్ వైడ్ మల్టీప్లెక్స్ చైన్ స్రీన్లలో
షెహజాదా సినిమాకు మల్టీప్లెక్స్‌లో మంచి రెస్పాన్స్ కూడగట్టుకొంటున్నది. పీవీఆర్ చైన్ మల్టీప్లెక్స్‌లో 1.47 కోట్లు, ఐనాక్స్‌లో 92 లక్షలు, సినిపోలీస్‌లో 53 లక్షలు వసూలు చేసింది. మల్టీ ప్లెక్స్ చైన్ స్క్రీన్లలో మొత్తం 3 కోట్ల వరకు కలెక్షన్లను సాధించింది. అయితే భూల్ భులయ్యా సినిమా కలెక్షన్లతో పోల్చుకొంటే.. తక్కువగానే వసూళ్లు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తొలి రోజు 1 ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
షెహజాదా సినిమా 1వ రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 7.1 కోట్ల గ్రాస్, 6 కోట్ల షేర్ కలెక్షన్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 90 లక్షలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

రెండో రోజు షెహజాదా కలెక్షన్ల అంచనా
ఇక షెహజాదా సినిమా 2వ రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. సెలవుదినం కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రం రెండో రోజు డబల్ డిజిట్‌ను నమోదు చేస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా 9 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 1 కోటి రూపాయలకుపైగా కలెక్షన్లను రాబట్టే అవకాశం కనిపిస్తున్నది. దాంతో ఈ సినిమా రెండో రోజు 10 కోట్లకుపైగా కలెక్షన్లను వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











