Don't Miss!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
విడుదలకు ముందే 20కోట్లు తెచ్చిన శేఖర్ కమ్ముల సినిమా.. ఇంత ఈజీగా వస్తాయని ఎవరు ఉహీంచలేదు!
ఫిదా సినిమా తరువాత మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా గ్యాప్ తీసుకొని చేసిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మొదటి సారి నాగ చైతన్య - సాయి పల్లవి కాంబినేషన్ ని సెట్ చేసిన ఈ దర్శకుడు టీజర్ తోనే ఆడియెన్స్ లో అంచనాల డోస్ పెంచాడు. ఇక సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. ఊహించని విదంగా లాభాలు అందుకునే అవకాశం ఉన్నట్లు అర్ధనవుతోంది.
నాగచైతన్య మార్కెట్ వాల్యూ పెరిగినట్లే..
హీరో నాగ చైతన్య మార్కెట్ గత కొంతకాలంగా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా మజిలీ సినిమా ద్వారా బాక్సాఫీస్ వద్ద మొదటి సారి 40కోట్ల వరకు బిజినెస్ చేశాడు. ఇక లవ్ స్టొరీ సినిమాను శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడు తెరకెక్కిస్తుండడం అలాగే సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండడంతో ఈ సారి మార్కెట్ వాల్యూ అంతకంటే ఎక్కువగా పెరగడం కాయం.
ఆయన బ్రాండ్ ఉంటే చాలు
శేఖర్ కమ్ముల సినిమా అంటే ఒక రియాలిటీ ఎమోషన్ ఉంటుంది. న్యాచురల్ ఫీలింగ్స్ తెరపై అలా కదులుతూ ఉంటాయి. అందుకే ఆయన సినిమాలను జనాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. స్టార్స్ ఎవరైనా సరే.. శేఖర్ కమ్ముల అనే బ్రాండ్ ఉంటే చాలు బాక్సాఫీస్ వద్ద సాలీడ్ ఓపెనింగ్స్ అందుతాయి.
సినిమా శాటిలైట్ రైట్స్..
ఇక మొదటిసారి వీరి సినిమాకు నాన్ థియేట్రికల్ గా పెట్టిన పెట్టుబడి లో దాదాపు సగానికి పైగా డబ్బులు వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంకా పూర్తిగా క్లోజ్ అవ్వలేది. కానీ నాన్ థియేట్రికల్ మార్గంలో అన్ని డీలింగ్స్ కూడా క్లోజ్ అయ్యాయి. సినిమా శాటిలైట్ ధర 8కోట్లకు పైగా అమ్ముడైనట్లు సమాచారం. స్టార్ మా ఆ హక్కులను సొంతం చేసుకుంది.
విడుదలకు ముందే 20కోట్లు
ఇక సినిమా డిజిటల్ రైట్స్ అల్లు వారి ఆహా యాప్ కు వెళ్లాయి. దాదాపు అక్కడ 6కోట్ల వరకు ధర పలికినట్లు తెలుస్తోంది. హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా సినిమాకు మరో 6కోట్ల వరకు వచ్చినట్లు టాక్. ఇక మ్యూజిక్ ద్వారా 50లక్షలు వచ్చాయట. ఈ విధంగా నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా నిర్మాతలకు మొత్తంగా 20.50కోట్ల వరకు ప్రాఫిట్స్ వచ్చినట్లు సమాచారం. చూస్తుంటే సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా సాలీడ్ వసూళ్లను అనుకునేలా ఉందని అర్ధమవుతోంది. చూడాలి మరి శేఖర్ కమ్ముల నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ ఏ రేంజ్ లో హిట్టవుతుందో..