Shilpa Shetty’s Sukhee Collections పాపం శిల్పాశెట్టి.. బాక్సాఫీస్ వద్ద సుఖి పరిస్థితి ఏమిటంటే?
బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ శిల్పాశెట్టి తన రూట్ మార్చి సోలో హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సుఖి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ స్టోరీతో గృహిణిగా కొత్త అవతారం ఎత్తి కాస్త డీ గ్లామర్ రోల్‌తో మెప్పించేందుకు ప్రయత్నం చేసింది. సెప్టెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుఖి చిత్రం ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా ఉందా? ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
సుఖి సినిమా విషయానికి వస్తే.. శిల్పాశెట్టి కుంద్రాతోపాటు అమిత్ సద్, దిల్నాజ్ ఇరానీ, నూతన నటీనటులు నటించారు. ఈ సినిమాకు సోనల్ జోషి దర్శకత్వం వహించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా లాంటి ప్రముఖ నిర్మాతలు ఈ సినిమాను 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.

శిల్పాశెట్టి నటించిన సుఖి సినిమా రిలీజ్‌కు ముందు నిర్వహించిన ప్రమోషన్స్ పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. సినిమా వస్తుందన్న విషయం కూడా రెగ్యులర్ ఆడియెన్స్‌కు తెలియలేకుండానే థియేటర్‌లోకి వచ్చింది. ఈ సినిమాను ఇండియాలో 400 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 25 కోట్లు బాక్సాఫీస్ వద్ద రాబట్టాల్సి ఉంటుంది.
సుఖి సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. పెద్దగా స్పందన కనిపించలేదు. ఈ సినిమా మార్నింగ్ షోకు 10 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 15 శాతం, ఫస్ట్ షోకు 12 శాతం, సెకండ్ షోకు 15 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమా ఓవరాల్‌గా 12 శాతం ఆక్యుపెన్సీ కష్టంగా నమోదైంది. ముంబైలో 15 శాతం, ఢిల్లీలో 15 శాతం, పూణెలో 10 శాతం నమోదైంది.

సుఖి సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. శిల్పా శెట్టి సినిమాకు బాక్సాఫీస్ వద్ద పెద్దగా రెస్పాన్స్ కనిపించలేదు. ఇండియాలో ఈ సినిమా 50 లక్షల షేర్, 1 కోటి గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 1.5 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











