20 కోట్ల టార్గెట్.. 40 లక్షల కలెక్షన్లు.. 4వ రోజే పాన్ ఇండియా మూవీ దుకాణం బంద్!

బాలీవుడ్‌లో ఇటీవల రిలీజైన చిత్రాల్లో దాదాపు 95 శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాకొట్టడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నది. కంగన రనౌత్ తేజస్ చిత్రం ఊహించని పరాజయం పొందిన తర్వాత అదే దారిలో కొన్ని క్రేజీ సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించపోయాయి. అందులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా తన జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన UT69 చిత్రం కలెక్షన్లపరంగా తీవ్ర నిరాశను మిగిల్చింది. UT69 సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అశ్లీల వీడియోల కుంభకోణంలో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను UT69 సినిమాగా తెరకెక్కించారు. అరెస్ట్ తర్వాత జైలులో అనుభవించిన దారుణమైన పరిస్థితులను, ఈ కుంభకోణంలో జరిగిన వాస్తవ విషయాలను తన సినిమా ద్వారా ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో ఆయన స్వయంగా తన పాత్రను తానే పోషించడం విశేషంగా మారింది.

Shilpa Shettys Husband Raj Kundras UT69 movie Closing Collections worldwide

బయోపిక్‌గా రూపొందిన UT69 సినిమా కోసం శిల్పాశెట్టి దంపతులు భారీగానే ఖర్చు చేశారు. ఈ సినిమాను రాజ్ కుంద్రా సుమారుగా 10 కోట్లకుపైగా బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 10 కోట్ల రూపాయల షేర్, 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సిన పరిస్థితి మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి ఆట నుంచే డిజాస్టర్‌గా నిలిచింది.

UT69 సినిమా కోసం రాజ్ కుంద్రా భారీగా ప్రచారం చేశారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ సినిమా కోసం ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమా విజయ భారాన్ని తానే మోశాడు. దాంతో రిలీజ్‌కు ముందు మంచి క్రేజ్ కనిపించింది. దాంతో ఈ సినిమాను అట్టహాసంగా పాన్ ఇండియా వైడ్‌గా 1000 కిపైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Shilpa Shettys Husband Raj Kundras UT69 movie Closing Collections worldwide

ఇక UT69 సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. ఈ మూవీ తొలి రోజు 10 లక్షల రూపాయల గ్రాస్ రాబట్టింది. రెండో రోజు 15 లక్షల గ్రాస్ వసూళ్లను, మూడో రోజు 10 లక్షల గ్రాస్, నాలుగో రోజు 5 లక్షల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ఆ తర్వాత ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోవడంతో తొలివారం తర్వాత సినిమాను థియేటర్స్ నుంచి ఎత్తి వేశారు. దాంతో నాలుగు రోజుల్లో 40 లక్షల రూపాయల కలెక్షన్లతో థియేట్రికల్ రన్ ముగిసింది.

UT69 మూవీ 10 కోట్ల రూపాయల షేర్, 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించిన ఈ చిత్రం పూర్తిగా చతికిల పడింది. దాదాపు 40 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 9 కోట్లకుపైగా నష్టాలతో తన కలెక్షన్ల జర్నీని ముగించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X