twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'శిరిడి సాయి' ఫైనల్ రిజల్ట్(ట్రేడ్ టాక్)

    By Srikanya
    |

    హైదరాబాద్: షిర్డీసాయిగా నాగార్జున నటించిన శిరిడి సాయి చిత్రం క్రితం గురువారం విడుదల అయిన సంగతి తెలిసిందే. బాబా సచరిత్ర ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ పరంగా చాలా డల్ గా ఉన్నట్లు ట్రేడ్ సమాచారం. అప్పటికీ నాగార్జున తన యూనిట్ తో కలిసి విజయ యాత్రలు చేస్తూ, టీవీల్లో కంటిన్యూగా ఇంటర్వూలు ఇస్తున్నారు. నాగార్జున భార్య అమల సైతం ఈ సినిమా ప్రమోట్ చేస్తోంది. అయితే బాబా భక్తులు అంతా కదిలి వచ్చి హిట్ చేస్తారనుకునే పరిస్ధితి కనపడటం లేదు. రిలీజైన మొదటి మూడు రోజులు కలెక్షన్స్ బాగున్నా..సోమవారం నుంచి చాలా చోట్ల డ్రాప్ అయిపోయాయి. ముఖ్యంగా టౌన్ లలో ఈ చిత్రం వర్కవుట్ అవుతుందని భావించారు. కానీ అక్కడా మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయింది.

    ముఖ్యంగా ఈ చిత్రం ఫెయిలవటానికి కారణం మౌత్ టాక్ పాజిటివ్ గా క్రియేట్ కాకపోవటమే అంటున్నారు. మొదటి రోజు సినిమాని చూసిన బాబా భక్తులు పెదవి విరిచారు. బాబా చరిత్రలోని ఘట్టాలను మార్చి, సినిమాటెక్ గా చేయటం వారికి నచ్చలేదు. అయితే దర్శక,నిర్మాతలు మాత్రం ఈ చిత్రం సూపర్ హిట్ అని చెప్తున్నారు. నిర్మాత ఎ.మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ ''బాబా జీవిత ఘట్టాల్నే కాదు.. ఆయన మహిమల్ని కూడా తెరపై ఆవిష్కరించే చిత్రమిది. నిత్యం సాయి దివ్యనామాన్ని జపించే భక్తులు ఎంతో మంది ఉన్నారు. వారితో బాబాకి ఉన్న అనుబంధాన్ని కూడా ఇందులో చూడొచ్చు. బాబా జీవితం సాత్వికమైనది. ఆ పాత్రలో నాగార్జున ఇమిడిపోయిన విధానం అందరినీ మెప్పిస్తుంది. సాయిబాబా పాత్రకోసం నాగార్జున ఎన్నో జాగ్రత్తలు తీసుకొని నటించారు''అన్నారు.

    'శిరిడి సాయి' చిత్రాన్ని 801 థియేటర్లలో విడుదలచేసారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్నాటక, సౌత్‌ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, దుబాయి, న్యూజిలాండ్‌, యు.ఎస్‌. తదిరత ప్రాంతాల్లోకూడా విడుదల చేసారు. చాలా చోట్ల విడుదలకు ముందే థియేటర్లు శుభ్రపరచి, బాబా విగ్రహాలను ఏర్పాటు చేసారని సమాచారం . చాలా చోట్ల విభూది,ప్రసాదం కూడా పంపిణీ చేసారని చెప్తున్నారు.

    నాగార్జున ఈ చిత్రం గురించి చెబుతూ ''బాబా జననం నుంచి జీవ సమాధి వరకూ ఉన్న అన్ని దశలనూ స్పృశించాం. నేటి తరంలో ఎంతోమంది సాయిబాబా బోధనలపై విశ్వాసం కలిగి ఉన్నారు. అందరికీ నచ్చేలా రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. సినిమాకు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది''అన్నారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సమర్పణ: సులోచనారెడ్డి, ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌రెడ్డి, కళ: భాస్కరరాజు, శ్రీకాంత్‌, సంగీతం: కీరవాణి.

    English summary
    Reports published in high level media agencies say that ‘Shirdi Sai’ film is going to end only as a weak commercial project. Notably, Nag and his team going on for Success Tours clearly shows the strategy behind makers to offer some boost for dropping revenues. Into the second week, ‘Shirdi Sai’ is doing well only on weekends and chances of picking up are remote.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X