Shiva 4K Day 1 Collections: శివ 4k మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. నాగార్జున సినిమాకు ఎన్ని కోట్లంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన చిత్రం శివ. ప్రస్తుత ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్టర్‌గా పరిచయం అవుతూ రూపొందించిన చిత్రంలో నాగార్జున అక్కినేని, అమల జంటగా నటించారు. ఈ చిత్రంలో రఘువరన్, జేడీ చక్రవర్తి, మురళీ మోహన్, తనికెళ్ల భరణి, కోటా శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్, గొల్లపూడి మారుతిరావు, బ్రహ్మజీ, ఉత్తేజ్, రామ్ జగన్, నిర్మలమ్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తనికెళ్ల భరణి మాటలు, ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ఇళయరాజా అందించారు. రామ్ గోపాల్ వర్మ కథ, మాటలు అందించిన ఈ చిత్రం అక్టోబర్ 5వ తేదీ 1989 సంవత్సరంలో రిలీజైంది. అయితే దాదాపు 36 ఏళ్ల తర్వాత మళ్లీ లేటేస్ట్ టెక్నాలజీతో 4K, డాల్బీ అట్మాస్‌తో నవంబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

శివ సినిమాను అప్పట్లోనే సుమారుగా 75 లక్షల రూపాయల బడ్జెట్‌తో నిర్మాత వెంకట్ అక్కినేని, యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. ఈ చిత్రానికి బిజినెస్ కూడా అంతగా క్రేజీగా జరుగలేదు. దాంతో ఈ సినిమాను నిర్మాతలే నైజాంలో సొంతంగా రిలీజ్ చేశారు. ఈ చిత్రం నైజాంలోనే 1 కోటి రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది. ఇక ఆంధ్రాలో ఈ చిత్రం 3 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 4 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వసూలు చేసింది. ఈ చిత్రం తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రిలీజై సంచలన విజయం సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం 1989, 1990 సంవత్సరాల్లో మొత్తం 10 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ సినిమా రీ రిలీజ్ కోసం, లేటేస్ట్ టెక్నాలజీతో డాల్పీ అట్మాస్, 4K టెక్నాలజీలోకి కన్వర్డ్ చేయడానికి దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎక్కువగా శ్రమించారు. ఈ సినిమా సౌండ్‌ను కొత్తగా ప్రజెంట్ చేయడానికి కసరత్తు చేశారు. డీఐ, ఇతర పనులన్నింటినీ పర్‌ఫెక్ట్‌గా చేశారు. అందుకు భారీగా ఖర్చు చేశారు. ఈ సినిమా 4K వెర్షన్ కోసం సుమారుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సినీ వర్గాలు వెల్లడించాయి.
ఈ సినిమా ప్రీమియర్లకు మంచి ఆదరణ, రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా తొలి రోజున విడుదలైన అన్నీ చోట్ల భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోనే దేవీలో 10 లక్షల రూపాయలు, సుదర్శన్ 35 ఎంఎంలో 12.5 లక్షల రూపాయలు వసూలు చేుసింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో తొలి రోజు వసూళ్లు సానుకూలంగా ఉన్నాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్‌లో అంటే నార్త్ అమెరికాలో గురువారం ప్రదర్శించిన ప్రీమియర్లకు 4 వేల డాలర్లు అంటే 3.5 లక్షల రూపాయలు, శుక్రవారం కడపటి వార్తలు అందేసరికి 25 లక్షల రూపాయల వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాల సమాచారం.
అయితే ఈ సినిమా తొలి రోజు భారీగానే వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ 1.5 నుంచి 2.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఆదివారం సెలవు దినం రోజున కూడా భారీగా వసూళ్లు నమోదు కావొచ్చు. అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











