Shiva 4K Day 3 Collections: శివ 4k మూవీకి అదిరిపోయే కలెక్షన్లు.. నాగార్జున సినిమాకు ఎన్ని కోట్లంటే?
Shiva 4K Re-Release Collections: తెలుగు సినిమా చరిత్రలో సంచలనాన్ని సృష్టించిన కల్ట్ క్లాసిక్ 'శివ'. ఈ మూవీ ఇప్పుడు కొత్త వర్సెన్ లో మళ్లీ థియేటర్లలో వచ్చింది. 1989లో విడుదలై ఇండస్ట్రీ ట్రెండ్ మార్చిన ఈ మూవీ దాదాపు 36 ఏళ్ల తర్వాత 4K, డాల్బీ అట్మాస్ రీస్టోర్ వెర్షన్‌గా నవంబర్ 14, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీ-రిలీజ్ అనౌన్స్ అయిన రోజు నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాత తరానికి నస్టాల్జియా, కొత్త తరానికి లెజెండరీ ఫీలింగ్ ను అందిస్తోన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లోంది. ఈ నేపథ్యంలో శివ 4K సినిమా బడ్జెట్, బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
1989లో విడుదలైన శివ సినిమా మొత్తం బడ్జెట్ (అప్పట్లో) కేవలం రూ. 75 లక్షలు మాత్రమే. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ చిత్రానికి మొదటి విడుదల సమయంలో ప్రిరీలీజ్ బిజినెస్ పెద్దగా జరగలేదు. అందుకే నిర్మాతలే నైజాంలో స్వయంగా రిలీజ్ చేశారు. కానీ, అది తీసుకున్న రిస్క్ సక్సెస్ అయ్యి, నైజాంలో ఒక్క కోటి రూపాయల వసూళ్లు, ఆంధ్రా ప్రాంతంలో మూడు కోట్ల రూపాయల వసూళ్లు చేసింది. మొత్తం రాష్ట్రంలో నాలుగు కోట్ల గ్రాస్ వసూలు చేసి అప్పటి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అలాగే.. ఆయా భాషల్లో విడుదలైన హిందీ, తమిళ వెర్షన్లు కలిపితే మొత్తం కలెక్షన్లు రూ. 10 కోట్లను దాటాయి. ఆ కాలంలో శివ మూవీ రికార్డు సెట్టర్ గా నిలిచింది.

శివ సినిమాకు ఎందుకు అంతగా కనెక్ట్ అయిందంటే? టాలీవుడ్‌లో అప్పటి వరకూ యూత్ యాక్షన్ సినిమాలు ఉన్నా, కాలేజీ రాజకీయాలు, రియలిస్టిక్ వైలెన్స్‌తో మాస్ ఫీల్ ఇచ్చిన తొలి సినిమా శివ. రామ్ గోపాల్ వర్మ టేకింగ్, తనికెళ్ల భరణి రైటింగ్, ఇళయరాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎస్.గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని మరింత పెంచాయి. నాగార్జున, అమల కెమిస్ట్రీ యువతలో ఫ్రెష్ లుక్‌గా నిలిచింది. ఇలా సక్సెస్ పుల్ గా నిలిచింది.
అలాంటి కల్ట్ మూవీ శివ రీ-రిలీజ్ కోసం ప్రత్యేకంగా పూర్తిస్థాయి డిజిటల్ రీస్టోరేషన్ చేపట్టారు. రామ్ గోపాల్ వర్మ స్వయంగా సౌండ్ డిజైన్,డీఐ, రీ-రికార్డింగ్ పనులన్నింటినీ పర్యవేక్షించాడు. మూవీని చిత్రాన్ని ఆధునిక టెక్నాలజీతో తిరిగి రూపుదిద్దడానికి సుమారు ₹2 కోట్లు ఖర్చు చేసినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. డాల్బీ అట్మాస్ మిక్సింగ్, 4K విజువల్ రిమాస్టరింగ్, నాయిస్ రిమూవల్, బ్లాక్ లెవల్స్, గ్రెయిన్ రీవర్క్ వంటి వాటికి ప్రత్యేకంగా పని చేయడం వల్ల సినిమాకు పూర్తిగా కొత్త అనుభూతి వచ్చింది. థియేటర్లలో చూసిన ప్రేక్షకులందరూ "ఇది పాత శివ కాదు... కొత్తగా తీర్చిదిద్దిన శివ" అని ప్రశంసిస్తున్నారు.
ఇప్పుడు రీ-రిస్టోర్ చేసిన శివ 4K విడుదలైన తర్వాత థియేటర్లలో మళ్లీ పండగ వాతావరణం ఏర్పడింది. RTC X రోడ్స్, విశాఖ, విజయవాడ, కరీంనగర్‌లలో స్పెషల్ ఫ్యాన్స్ షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా మొదటి రెండు రోజుల్లో కలెక్షన్లు రికార్డు స్థాయికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా శివ 4K సినిమా తొలి రోజు కలెక్షన్ సుమారు ₹2.5 కోట్లు గ్రాస్‌గా నమోదైంది. ఇక రోజు కలెక్షన్స్ కూడా అదేస్థాయిలో అందుకున్నాయి . రెండోవ రోజు కూడా అదే జోష్ కొనసాగినట్టు తెలుస్తోంది. శనివారం నాడు శివ 4K మూవీ రూ. 2 కోట్లు వరకూ వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. ఇలా రెండు రోజుల్లో శివ మూవీ ప్రపంచవ్యాపంగా 3.95 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.
ఇక డే 3 కూడా శివ 4 కే మూవీ అదే జోరును కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఆదివారం కావడంతో మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. మూడో రోజు కూడా రూ. 2 కోట్ల వరకూ కలెక్షన్లు రాబట్టే అవకాశముందని అంచనా. ఇలా శివ 4K సినిమా మొత్తం మూడు రోజుల్లో రూ. 6 కోట్ల గ్రాస్ దాటే అవకాశాలు ఉన్నాయి. ఇది నిజమైతే.. 'బాషా', 'ఘరానా మొగుడు', 'ఒక్కడు' వంటి రీ-రిలీజ్ రికార్డులను 'శివ' బ్రేక్ చేసే అవకాశముందని ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద.. నాగార్జున - రామ్ గోపాల్ వర్మ కాంబో మూవీ శివ రీ-రిలీజ్ కూడా ఓ ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











