Shiva Box Office Closing Collections: శివ క్లోజింగ్ కలెక్షన్లు.. 75 లక్షల బడ్జెట్.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన చిత్రం శివ. ప్రస్తుత ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్టర్‌గా పరిచయం అవుతూ రూపొందించిన చిత్రంలో నాగార్జున అక్కినేని, అమల జంటగా నటించారు. ఈ చిత్రంలో రఘువరన్, జేడీ చక్రవర్తి, మురళీ మోహన్, తనికెళ్ల భరణి, కోటా శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్, గొల్లపూడి మారుతిరావు, బ్రహ్మజీ, ఉత్తేజ్, రామ్ జగన్, నిర్మలమ్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తనికెళ్ల భరణి మాటలు, ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ఇళయరాజా అందించారు. రామ్ గోపాల్ వర్మ కథ, మాటలు అందించిన ఈ చిత్రం అక్టోబర్ 5వ తేదీ 1989 సంవత్సరంలో రిలీజైంది. అయితే దాదాపు 36 ఏళ్ల తర్వాత మళ్లీ లేటేస్ట్ టెక్నాలజీతో 4K, డాల్బీ అట్మాస్‌తో నవంబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్, బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Shiva Box Office Closing Collections Worldwide Here is the Nagarjuna RGV s movie box office Report

శివ సినిమాను పూర్తిగా ఎలాంటి అంచనాలు లేకుండా మొదలుపెట్టారు. దాదాపు అంతా కొత్తవారితోనే సినిమాను పూర్తి చేశారు. నాగార్జున, అమల, రఘువరన్, మురళీ మోహన్ తప్పించి పెద్దగా తెలిసిన ఫేసులు కూడా లేకపోయాయి. దాంతో ఈ సినిమాను అప్పట్లోనే సుమారుగా 75 లక్షల రూపాయల బడ్జెట్‌తో నిర్మాత వెంకట్ అక్కినేని, యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. ఈ చిత్రానికి బిజినెస్ కూడా అంతగా క్రేజీగా జరుగలేదు. దాంతో ఈ సినిమాను నిర్మాతలే నైజాంలో సొంతంగా రిలీజ్ చేశారు.

ఆంధ్రాలో కృష్ణా, గుంటూరు, ఇతర జిల్లాల్లో బిజినెస్ ఓ మాదిరిగా జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటాయి. విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలో నిర్మాతలే స్వయంగా రిలీజ్ చేశారు. ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో సంచలనం విజయం సాధించింది. ఈ చిత్రం ఆంధ్రా, తెలంగాణలో కలిపి 22 సెంటర్లలో 100 రోజులు, 5 సెంటర్లలో 175 రోజులు ఆడింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి

శివ చిత్రం థియేటర్లలో ప్రభంజనం కొనసాగించడంతో కాసుల పంట పండింది. అనూహ్య విజయంతో 1989 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం నైజాంలోనే 1 కోటి రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది. ఇక ఆంధ్రాలో ఈ చిత్రం 3 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 4 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వసూలు చేసింది.

ఈ చిత్రం తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రిలీజై సంచలన విజయం సాధించింది. తమిళంలో ఉదయం పేరిట ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా 10 సెంటర్లలో 100 రోజులు, 5 సెంటర్లలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకొన్నది. అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం 1989, 1990 సంవత్సరాల్లో మొత్తం 10 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X