Karataka Damanaka Collections శివ రాజ్‌కుమార్, ప్రభుదేవా మూవీకి షాకింగ్ వసూళ్లు.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన చిత్రం కరాటక దమనక. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, నటుడు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, ప్రియానంద్, నిష్విక నాయుడు నటించిన ఈ సినిమాకు యోగారాజ్ భట్ దర్శకత్వం వహించారు. హరికృష్ణ వీ మ్యూజిక్ అందించారు. సంతోష్ రాయ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీన కన్నడలో రిలీజైంది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అత్యంత ప్రాచుర్యం పొందిన పంచతంత్ర కథల ఆధారంగా ఈ సినిమాను యోగారాజ్ భట్ తెరకెక్కించారు. ఈ స్టోరీలో నక్కలు కథను సినిమాటిక్‌గా మలిచారు. విరూపాక్ష (శివరాజ్ కుమార్) నటించగా, బసవరాజుగా (ప్రభుదేవా) పోషించాడు. దోపిడి కేసులో శిక్ష అనుభవిస్తున్న ఈ ఇద్దరిని ఉత్తర కర్ణాటకలోని నందికొలూరు అనే ఫ్యాక్షన్ గ్రామానికి జైలర్ పంపుతాడు. ఆ ప్రాంతానికి వెళ్లిన వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా కథ.

Shiva Rajkumar s Karataka Damanaka Box Office Collections Worldwide Prabhu Deva movie struggling at GBOC

కరటాక దమనక చిత్రంలో అగ్ర తారలు నటించడం, సినిమాను రాజీ లేకుండా నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మించడంతో భారీ బడ్జెట్ అయింది. ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 20 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను కన్నడలో అత్యధిక స్క్రీన్లలో అంటే సుమారుగా 300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

శివరాజ్ కుమార్ నటించిన ఈ సినిమాకు తొలి రోజు ఓ మోస్తారు కలెక్షన్లు రాబట్టింది. కర్ణాటకలో ఈ మూవీ 65 లక్షల నికర వసూళ్లు, 1.2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. బెంగళూరులోనే ఈ చిత్రం 50 లక్షల రూపాయలు వసూలు చేయడం గమనార్మం. ఈ సినిమా రెండో రోజు 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో రెండు రోజుల్లో 1.35 కోట్లు కలెక్షన్లను రాబట్టింది.

Shiva Rajkumar s Karataka Damanaka Box Office Collections Worldwide Prabhu Deva movie struggling at GBOC

ఇక మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రెండ్రోజుల కంటే మూడో రోజు ఎక్కువగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం మూడో రోజు 75 లక్షలు నికరంగా, బెంగళూరులోనే 50 లక్షలు రాబట్టింది. దాంతో ఈ సినిమా మూడు రోజుల్లో 2.10 కోట్ల నికరంగా..4 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక నాలుగో రోజు ఈ సినిమా కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఈ సినిమా కేవలం 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 2.35 కోట్లు బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది.

ఇక కరాటక దమనక చిత్రం ఐదో రోజు అంతంతా మాత్రంగానే కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా సుమారుగా 30 లక్షలు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. ఈ వారంలో కలెక్షన్లు పెరిగితే తప్పా.. బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమే అంటున్నారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 7 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X