Shivam Bhaje Collections: శివం భజే డే 1 కలెక్షన్లు.. బడ్జెట్ ఎంత? ఎన్ని కోట్లు వస్తే లాభాల్లోకి అంటే?

యువ హీరో అశ్విన్ బాబు, యువ హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ జంటగా అఫ్సర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శివం భజే. గంగా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన చిత్రంలో హైపర్ ఆది, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్ నటించారు.

ఇంటర్నేషనల్ టెర్రరిజం, మెడికల్ మాఫియా అంశాలతోపాటు శివ తత్వం అనే పురాణాల నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత? ఈ చిత్రం సాధిస్తున్న రోజు వారీ కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..

Shivam Bhaje movie Day 1 expected Collections Worldwide

శివుడి లీల, పురాణాల నేపథ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన శివం భజే సినిమాను గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్‌తో చాలా రిచ్‌గా రూపొందించారు. అర్బాజ్ ఖాన్, అశ్విన్ బాబు, దిగంగన లాంటి ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని 15 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్, ట్రైలర్లు, టీజర్లకు మంచి రెస్సాన్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ సినిమాను ఆంద్రా, నైజాం ప్రాంతాలు, అలాగే ఓవర్సీస్‌లో కలిపి మొత్తంగా 600 నుంచి 650 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

శివం భజే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 5 కోట్ల షేర్.. 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను వాల్యూ కట్టారు. ఇప్పటికే ఈ సినిమా హిందీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోవడం తెలిసిందే. ఈ సినిమా థియేట్రికల్‌గా బెటర్‌గా ఫెర్ఫార్మ్ చేస్తే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అలాగే శివం భజే సినిమా మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. కాకినాడ, గుంటూరు, వైజాగ్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో మంచి ఆక్యుపెన్సీ నమోదు చేసింది. దాంతో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు కలెక్షన్లతో సుమారుగా 80 లక్షల గ్రాస్, 40 లక్షల నికర వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X