Shivrayancha Chhava Collections జిజియా పన్ను, మొఘల్స్‌పై మరాఠీల యుద్దం.. శివ్‌రాయంచ ఛావకు కలెక్షన్ల వర్షం!
మల్హర్ పిక్చర్ కంపెనీ, ఏఏ ఫిల్మ్స్, ఎవరెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన మరాఠీ చిత్రం శివరాయంచ ఛావ. దిగ్‌పాల్ లంజేకర్ దర్శకత్వంలో ఈ సినిమాను వైభవ్ భోర్, మధు, కిషోర్ పాట్కర్ నిర్మించారు. ఈ సినిమాలో మృణాల్ కులకర్ణి, చిన్మయ్ మండ్లేకర్, భూషణ్ పాటిల్, రవి కాలే, రాహుల్ దేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చత్రపతి శివాజీ జన్మదినం సందర్బంగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఛత్రపతి శివాజీ మరణాంతరం జరిగిన సంఘటనల ఆధారంగా పిరియాడిక్, యాక్షన్, డ్రామాగా శివరాయంచ ఛావ (Shivrayancha Chhava Budget) సినిమా రూపొందింది. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా ఈ సినిమా 8 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ చిత్రాన్ని ఇండియాలో 600 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 100 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

శివాజీ మహారాజ్ మరణాంతరం రాజ్యాధికారాన్ని చేపట్టిన చత్రపతి శంభాజీ మహారాజ్‌కు మొఘల్ సామ్రాజ్యాధినేతల నుంచి భారీగా సవాళ్లు ఎదురయ్యాయి. రాజ్యంలో హిందువులుగా జీవించాలంటే.. జిజియా పన్ను కట్టాల్సిందేనని హుకుం జారీ చేశారు. హిందువులను ఔరంగజేబ్ దారుణంగా హింసించారు. దాంతో మొఘల్ పాలకులపై శంభాజీ యుద్ధం ప్రకటించారు. డెక్కన్, బుర్హాన్‌పుర్ సామంతులపై పోరాటం ఎలా సాగింది? దాని ఫలితం ఏమిటనేది ఈ సినిమా కథ (Shivrayancha Chhava Story). ఈ చిత్రానికి సినీ క్రిటిక్స్ నుంచి భారీ స్పందన వస్తున్నది.
శివరాయంచ ఛావ (Shivrayancha Chhava Box Office) సినిమా ట్రైలర్లు, ప్రమోషనల్ ఈవెంట్లకు మంచి స్పందన రావడంతో మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. దాంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించాయి. దాంతో సానుకూలంగా బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. హిందీ సినిమాలతో పోటీ పడుతూ కలెక్షన్లు సాధిస్తున్నది.

ఇక మరాఠీ భాష, ప్రాంతాల్లో రిలీజైన శివరాయంచ ఛావ (Shivrayancha Chhava Collections) చిత్రం గత 5 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ తొలి రోజున 65 లక్షల నికర వసూళ్లు, 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను, 2వ రోజు 1 కోటి రూపాయల కలెక్షన్లు, 3వ రోజు 1.3 కోట్లు, 4వ రోజు 75 లక్షల రూపాయలు, 5వ రోజు 50 లక్షల రూపాయల వసూళ్లు సాధించింది. సుమారుగా ఈ సినిమా 7 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
మూవీ: శివరాయంచ ఛావ (Shivrayancha Chhava)
నటీనటులు: మృణాల్ కులకర్ణి, చిన్మయ్ మండ్లేకర్, భూషణ్ పాటిల్, ఆయేషా మధుకర్, ప్రసన్న కేట్కర్, అభిజిత్ శ్వేతాచంద్ర, రవి కాలే, రాహుల్ దేవ్, సమీర్ ధర్మాధికారి తదితరులు
రచన, దర్శకత్వం: దిగ్‌పాల్ లంజేకర్
నిర్మాత: వైభవ్ భోర్, మధు, కిషోర్ పాట్కర్
మ్యూజిక్: దేవదత్తా మనీషా బాజీ
సినిమాటోగ్రఫి: ప్రియాంక మయేకర్
ఎడిటింగ్: సాగర్ షిండే, వినయ్ షిండే
ఆర్ట్: ప్రతీక్ రెడిజ్
బ్యానర్: మల్హర్ పిక్చర్ కంపెనీ
సమర్పణ: ఏఏ ఫిల్మ్స్, ఎవరెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2024-02-16


Click it and Unblock the Notifications











