twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RC 15, Varisu Rights: చరణ్, విజయ్‌తో దిల్ రాజు మార్కెట్ స్ట్రాటజీ.. భారీ డీల్‌కు అమ్ముడైన సినిమాలు!

    |

    సినిమా ప్రపంచంలో రోజురోజుకీ మార్కెట్ వాల్యూ చాలా పెరిగిపోతుంది. అగ్ర హీరోలు అందరూ కూడా వారి తదుపరి సినిమాలకు తీసుకునే పారితోషకాలనుంచి జరిగే బిజినెస్ డీల్స్ వరకు అన్ని నెంబర్లు కూడా గట్టిగానే పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఎక్కువ మంది ఫోకస్ అయితే రాబోయే పాన్ ఇండియా సినిమాల పైనే ఉంది. ఇక దిల్ రాజు నుంచి కూడా రాబోయే రోజుల్లో చాలా పెద్ద సినిమాలు రాబోతున్నాయి. అయితే అందులో రామ్ చరణ్ విజయ్ సినిమాలను ఓకే రేట్ తో అమ్మేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఇటీవల చరణ్ విజయ్ సినిమాలను కలిపి ఒక డీల్ సెట్ అయినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

    శంకర్ - చరణ్ మూవీ

    శంకర్ - చరణ్ మూవీ

    ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఒక తమిళ దర్శకుడు తమిళ హీరోతో విభిన్నమైన కాంబినేషన్లో సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. ముందుగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తో ఒక బిగ్ బడ్జెట్ సినిమాలో వెండితెరపైకి తీసుకురాబోతున్నాడు. అయితే ఇదివరకే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని బిజినెస్ డీల్స్ చాలావరకు క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది. ఆచార్య సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కూడా రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ పై పెద్దగా ప్రభావం పడలేదు. మంచి అంచనాలు ఉన్నాయి.

    విజయ్ సినిమాకు

    విజయ్ సినిమాకు

    అలాగే దిల్ రాజు ప్రొడక్షన్లో రాబోతున్న బైలాంగ్యువల్ మూవీ వారిసు సినిమాకి కూడా మార్కెట్లో మంచి వ్యాల్యూ అయితే ఏర్పడుతుంది. మహర్షి తర్వాత దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న వారీసు సినిమాను తెలుగులో వారసుడిగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. అయితే ఈ సినిమాకు విజయ్ క్రేజ్ కారణంగానే ఓవర్సీస్ లో కూడా భారీగానే డిమాండ్ ఏర్పడింది. ఇదివరకే విజయ్ చాలా సినిమాలు ఓవర్సీస్ లో పెట్టిన పెట్టుబడులకు డబుల్ ప్రాఫిట్స్ అయితే వచ్చాయి.

     భారీ డిమాండ్

    భారీ డిమాండ్

    మొదటిసారి దిల్ రాజు సంస్థ నుంచి ఒకేసారి విభిన్నంగా బిగ్ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. దీంతో ఇండస్ట్రీలో బిజినెస్ అయితే గట్టిగానే జరిగే అవకాశం ఉంది. ఇక వారసుడు సినిమా కంటే ఎక్కువగా శంకర్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ కు మంచి డిమాండ్ అయితే ఉంది. అయితే నిర్మాత మాత్రం రెండు సినిమాల ఓవర్సీస్ హక్కులను ఒక రేటుకు అమ్మడానికి సిద్ధమయ్యారట. ముందుగా RC15 సినిమాను అమ్మడానికి రెడీ అయ్యారు. కానీ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని వెనక్కి తగ్గారు.

     రెండు సినిమాల డీల్ ఎంతంటే?

    రెండు సినిమాల డీల్ ఎంతంటే?

    విజయ్ సినిమాలకు గత కొన్నేళ్లుగా ఓవర్సీస్ లో మార్కెట్ అయితే పెరుగుతూనే ఉంది. ఇక ఫైనల్ గా దిల్ రాజు రామ్ చరణ్ 15వ సినిమాతో కలిపి రెండు సినిమాల ఓవర్సీస్ హక్కులను 65 కోట్లకు అమ్మాలని చూస్తున్నారట. అయితే ఆ డీల్ దాదాపు 60 కోట్లకు సెట్టయ్యే అవకాశం ఉంది. ఎలా చూసుకున్నా కూడా దిల్ రాజుకి రెండు సినిమాల ద్వారా మంచి ప్రాఫిట్స్ వచ్చినట్లే లెక్క. మరి ఈ సినిమాలు ఓవర్సీస్ మార్కెట్ లో ఎలాంటి ప్రాఫిట్స్ అందిస్తాయో చూడాలి. ఇక రాబోయే రోజుల్లో దిల్ రాజు మెగాస్టార్ ప్రభాస్ ఇలా అగ్ర హీరోలతో కూడా సినిమాలు చేయనున్నారు.

    English summary
    shocking deals for dil raju upcoming movie in overseas market varisu RC 15
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X