For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  KGF 2కు RRR కంటే ఎక్కువ డిమాండ్.. అలాంటి ఆఫర్ కు షాక్ తిన్న నిర్మాతలు!

  |

  ఇండియన్ సినిమా చరిత్రలోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అసలైతే కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈపాటికే ఇండియన్ బాక్సాఫీస్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయేది. వైపు కన్నడ సినిమాలు మరో వైపు టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ బిగ్ బడ్జెట్ సినిమాలకు నిత్యం పోటీగా నిలిచే ప్రయత్నం చేస్తున్నాయి. బాహుబలి అనంతరం KGF చాప్టర్ వన్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  యష్ కథానాయకుడిగా నటించిన ఆ పాన్ ఇండియా సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సెకండ్ చాప్టర్ కోసం కూడా దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. KGF చాప్టర్ వన్ ఒక శాంపిల్ మాత్రమే అంటూ చాప్టర్ 2 మాత్రం అంతకుమించి ఎలా ఉంటుంది అని ఇదివరకే చిత్ర యూనియ్ ఫస్ట్ లుక్ టీజర్ తో ఒక క్లారిటీ ఇచ్చేసింది. సినిమాకు భారీగా ఒకటి ఆఫర్స్ కూడా వచ్చినట్లు సమాచారం.

   సరికొత్త రికార్డులు

  సరికొత్త రికార్డులు

  KGF చాప్టర్ వన్ విడుదలైనప్పుడు నార్త్ ఇండస్ట్రీలో రేటింగ్స్ చాలా తక్కువగా వచ్చాయి. అసలు ఈ కన్నడ సినిమా ఈ స్థాయిలో రిలీజ్ అవ్వడమే ఎక్కువ.. ఇక బాక్సాఫీస్ వద్ద 50 కోట్లు కలెక్ట్ చేయడం మరింత అదృష్టం అని కామెంట్స్ వచ్చాయి. కానీ వాళ్ళ ఊహించని రేంజ్ లో KGF 1 బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక కన్నడ సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా విడుదలైన తర్వాత కూడా అమెజాన్ ప్రైమ్ లో అత్యధిక సినిమాగా కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.

  అనుకోకుండా వాయిదా

  అనుకోకుండా వాయిదా

  ఈ సినిమాపై నిర్మాతలు అలాగే బయ్యర్లు పెట్టిన పెట్టుబడికి సాలీడ్ లాభాలను అందుకున్నారు. KGF చాప్టర్ 2 పై అంతకంతకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మధ్యలో పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ అంచనాలను ఒక్కసారిగా మరింత పెంచేసింది. దీంతో ఓటీటీ సంస్థలకు ఈ సినిమాపై గట్టిగానే నమ్మకం ఏర్పడింది. దీంతో KGF 2ని లైన్ లో పెట్టె ప్రయత్నం చేశారు. KGF 2 అసలైతే ఈ ఏడాది డిసెంబర్ లోనే గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకున్నారు. జూలైలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని అందరూ ఫిక్స్ అయిన సమయంలో అనుకోకుండా వాయిదా పడింది. థియేటర్స్ లో పూర్తి స్థాయిలో ఫామ్ లోకి రాకపోవడంతో సినిమాను ఏడాది చివరికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

  RRRకు ఓటీటీ ఆఫర్స్

  RRRకు ఓటీటీ ఆఫర్స్

  సినిమాకు అయితే ఓటీటీ ఆఫర్స్ గట్టిగానే వచ్చినట్లు టాక్ వస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా కంటే కూడా KGF 2కు ప్రభుత్వంలో ఒక ఆఫర్ ఐతే చేసినట్లు వస్తోంది. RRR సినిమాకు డైరెక్ట్ గా ఓటిటీ ఆఫర్స్ అయితే అంత పెద్దగా ఏమీ రాలేదు. నెట్ ఫ్లిక్స్ హాట్ స్టార్ వంటి ప్రముఖ కంపెనీలు అయితే బడ్జెట్ కంటే ఒక వంద కోట్లు ఎక్కువగా ఆఫర్ చేసినట్లు ఆ మధ్య కొన్ని రూమర్స్ వైరల్ అయ్యాయి.

  KGF చాప్టర్ 2 ఓటీటీ డీల్స్

  KGF చాప్టర్ 2 ఓటీటీ డీల్స్

  అయితే RRR విషయంలో మాత్రం దర్శక నిర్మాతలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అనే ఆలోచన కూడా రానివ్వడానికి ఇష్టపడలేదు. ఎలాంటి ఆఫర్స్ వచ్చినా కూడా వాటిని మొదటి దశలోనే రిజెక్ట్ చేశారు. ఎలాగైనా ఈ బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేయాలని వాళ్ళు స్ట్రాంగ్ ఫిక్స్ అయ్యారు.KGF చాప్టర్ 2 నిర్మాతలు కూడా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా డైరెక్ట్ గా థియేటర్స్ లో విడుదల చేయాలని బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ సినిమాకుకు దాదాపు 600 కోట్ల వరకు ఓటీటీ ఆఫరలెర్స్ కూడా వచ్చినట్లు ఒక టాక్ అయితే వచ్చింది. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఇటీవల తీవ్ర స్థాయిలో ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ హక్కులకోసం గట్టిగానే పోరాడినట్లు సమాచారం.

  Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
   రిలీజ్ ఎప్పుడంటే

  రిలీజ్ ఎప్పుడంటే


  కానీ దర్శకకుడు ప్రశాంత్ నీల్ చర్చలు జరిపి ఓటీటీ ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా ముందే రిజెక్ట్ చేయాలని నిర్మాతలతో గట్టిగానే చర్చలు జరిగినట్లు సమాచారం. ఇక సినిమా విడుదల పై మరోసారి సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు అన్ని పూర్తయ్యాయి. ఇక రిలీజ్ అవ్వడమే నెక్స్ట్ టార్గెట్. ప్రీ రిలీజ్ బిజినెస్ కు సంబంధించి బిజినెస్ కూడా ఆల్ మోస్ట్ క్లోజ్ అయ్యాయని టాక్ వస్తోంది. ఇక సినిమాను ఏడాది చివరలోనే ఎలాగైనా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్స్ లో ఉన్న డీల్స్ సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి KGF 2 సినిమా చాప్టర్ వన్ కంటే ఏ స్థాయిలో కలెక్షనన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ టు అనంతరం సోలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఆ తరువత జూనియర్ ఎన్టీఆర్ తో మరొక పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టనున్నారు. ఆ సినిమాలపై కూడా భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

  English summary
  It is not uncommon for a Kannada film to receive Pan India level for the first time. KGF Cinema has overturned all those ideas at a time when it would be great to have a market of 50 crores. The latest blockbuster product from Chapter 1 has just hit the shelves. Fans are eagerly awaiting the success of the film as never before.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X