కల్కి 2898 AD రికార్డును బ్రేక్ చేసిన స్త్రీ 2.. ప్రభాస్ సినిమా కలెక్షన్స్ పై కన్నేసిన శ్రద్దా కపూర్

పాన్ ఇండియా , సౌత్ సినిమాల ధాటికి బాలీవుడ్ డీలా పడిపోయిన సంగతి తెలిసిందే. మాస్ మసాలా ఎలిమెంట్స్‌తో వచ్చే దక్షిణాది చిత్రాలు హిందీ జనానికి బాగా కనెక్టవుతూ ఉండటంతో కలెక్షన్ల కుంభవృష్టి కురుస్తోంది. సౌత్ బాటలో అదే ఫార్మూలానే ఫాలో అవుతూ హిందీ మేకర్స్ తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడ్డాయి. చేసేదేం లేక దక్షిణాది నుంచే నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్లను ఇంపోర్ట్ చేసుకుని సినిమాలు తీసుకోవాల్సిన పరిస్ధితికి దిగజారింది బాలీవుడ్.

తిరిగి పాత రోజులు రావాలని బాలీవుడ్ జనాలు కోరుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ బ్యాక్‌ టూ బ్యాక్ రెండు భారీ హిట్‌లను కొట్టగా.. గతేడాది రణబీర్ కపూర్ తన వంతుగా యానిమల్‌‌తో ఊరట కలిగించారు. కానీ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన బడా చిత్రాలు ఫట్ మనడంతో తిరిగి యథాస్థితికి బాలీవుడ్ చేరిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి దశలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ - రాజ్ కుమార్ రావు కాంబినేషన్‌లో తెరకెక్కిన స్త్రీ-2 సంచలన విజయం నమోదు చేసింది.

Shraddha Kapoor and Rajkummar Rao starrer Stree 2 Beats Prabhas s Kalki 2898 AD collections record

అమర్ కౌశిక్ దర్శకత్వంలో కామోడీ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి కీలకపాత్ర పోషించారు. ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా.. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో డే బై డే స్క్రీనింగ్‌ను పెంచుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కంటెంట్ ఉంటే సినిమా అదే ఆడుతుందనే నమ్మకాన్ని స్త్రీ-2 కలిగించింది. కరెక్ట్ సినిమా పడితే బాలీవుడ్ ఆడియన్స్ ఎలా నెత్తిన పెట్టుకుంటారో స్త్రీ -2 కలెక్షన్స్‌ని చూస్తే అర్ధమవుతుంది.

ఈ సినిమా ఫస్ట్ డే రూ.55 కోట్లు, రెండో రోజు రూ.35 కోట్లు, మూడవ రోజు రూ.45 కోట్లు వసూళ్లు రాబట్టడమే కాకుండా ఈ ఏడాది హిందీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. చూస్తుంటే మరో రెండు రోజుల్లో స్త్రీ -2 .. రూ.200 కోట్లు రాబట్టేలా ఉందని, లాంగ్ రన్‌లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు.. స్త్రీ-2 తన దూకుడుతో ఫైటర్, కల్కి 2898 ఏడీ (హిందీ) ఓపెనింగ్ రికార్డులను బద్ధలుకొట్టింది.

Shraddha Kapoor and Rajkummar Rao starrer Stree 2 Beats Prabhas s Kalki 2898 AD collections record

ఫైటర్, కల్కిలు ఫస్ట్ డే రూ.22 నుంచి రూ.24 కోట్ల వసూళ్లను రాబడితే.. స్త్రీ-2 ఏకంగా రూ.47 కోట్ల కలెక్షన్లు అందుకుని స్టార్ హీరోలు కూడా అందుకోలేని ఫీట్‌ను నమోదు చేసింది. రూ.60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఈ వీకెండ్‌లో ఒక్క ఇండియన్ ఆఫీస్ కలెక్షన్లే రూ.204 కోట్లను రాబట్టింది. అంటే పెట్టిన పెట్టుబడిపై ఇప్పటికే రూ.144 కోట్ల రాబడిని అందించింది. ఈ ఏడాది టాప్ -5 మోస్ట్ ప్రాఫిటబుల్ హిందీ ఫిలింస్ విషయానికి వస్తే ముంజ్యా 256 శాతం, హనుమాన్ (హిందీ) 241.7 శాతం, స్త్రీ-2 240 (ఇప్పటి వరకు), కల్కి 2898 ఏడీ (హిందీ), సైతాన్ 132.20 శాతం రాబడులను అందించాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. స్త్రీ-2 జోరు చూస్తుంటే రాబోయే రోజుల్లో నెంబర్ వన్ ప్లేస్‌ను దక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X