Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రద్దాకపూర్ ధమాకా.. చిన్న సినిమానే.. కానీ కోట్లు కొల్లగొట్టేసింది..
దంగల్ ఫేం డైరెక్టర్ నితీష్ తివారీ రూపొందించిన చిచ్చోర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అరుదైన ఘనతను సాధించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్దాకపూర్ జంటగా నటించిన ఈ చిత్రం వసూళ్లపరంగా మరో మైలురాయిని దాటింది. చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించి ట్రేడ్ వర్గాలకు షాకిచ్చింది. అంతేకాకుండా రూ.200 కోట్లవైపు దూసుకెళ్తున్నది. ఈ సినిమా ఎంత మేరకు కలెక్షన్లను సాధించిందంటే..
సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 5వ రోజున 50 కోట్ల మైలురాయిని చేరుకొన్నది. ఆ తర్వాత 9 రోజుల్లోనే రూ.75 కోట్లు సాధించింది. అదే ఊపును కొనసాగిస్తూ 12వ రోజున రూ.100 కోట్ల మైలురాయిని చేరుకొన్నది. ఇక 17వ రోజున 125, 31వ రోజున రూ.150 కోట్ల క్లబ్లో చేరి ట్రేడ్ అనలిస్టులను ఆశ్చర్యానికి గురిచేసింది.
తొలుత ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్ సినిమా నుంచి చిచ్చోర్ చిత్రం గట్టిపోటిని ఎదుర్కొన్నది. నువ్వా నేనా అన్నట్టు కలెక్షన్ల ప్రవాహం సాగింది. చివరకు చిచ్చోర్కు ప్రజాదరణ లభించడంతో కలెక్షన్లపరంగా మరో మెట్టునెక్కింది.
చిచ్చోర్ చిత్రం కాలేజ్ హాస్టల్ డేస్ నేపథ్యంగా స్నేహితుల ప్రేమ, ఆప్యాయతలు, మనస్పర్దలు ఆధారంగా తెరకెక్కింది. ఢిల్లీ బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమాను నితీష్ తివారీ చక్కగా తెరకెక్కించారు. కథ, కథనాలు ఆకట్టుకోవడంతో థియేటర్లకు యూత్ ఆడియెన్స్ పోటెత్తారని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషించారు.
ఇక బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు మంచి విజయాన్ని అందించింది. ఎంఎస్ ధోని సినిమా తర్వాత మరో రూ.100 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకొన్నాడు. ఈ చిత్ర విజయంతో మరింత జోష్‌ను కూడగట్టుకొన్నాడు.