twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రద్దాకపూర్ ధమాకా.. చిన్న సినిమానే.. కానీ కోట్లు కొల్లగొట్టేసింది..

    |

    దంగల్ ఫేం డైరెక్టర్ నితీష్ తివారీ రూపొందించిన చిచ్చోర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అరుదైన ఘనతను సాధించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్దాకపూర్ జంటగా నటించిన ఈ చిత్రం వసూళ్లపరంగా మరో మైలురాయిని దాటింది. చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించి ట్రేడ్ వర్గాలకు షాకిచ్చింది. అంతేకాకుండా రూ.200 కోట్లవైపు దూసుకెళ్తున్నది. ఈ సినిమా ఎంత మేరకు కలెక్షన్లను సాధించిందంటే..

    సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 5వ రోజున 50 కోట్ల మైలురాయిని చేరుకొన్నది. ఆ తర్వాత 9 రోజుల్లోనే రూ.75 కోట్లు సాధించింది. అదే ఊపును కొనసాగిస్తూ 12వ రోజున రూ.100 కోట్ల మైలురాయిని చేరుకొన్నది. ఇక 17వ రోజున 125, 31వ రోజున రూ.150 కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ అనలిస్టులను ఆశ్చర్యానికి గురిచేసింది.

    Shraddha Kapoors Chhichhore crosses 150 crores

    తొలుత ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్ సినిమా నుంచి చిచ్చోర్ చిత్రం గట్టిపోటిని ఎదుర్కొన్నది. నువ్వా నేనా అన్నట్టు కలెక్షన్ల ప్రవాహం సాగింది. చివరకు చిచ్చోర్‌కు ప్రజాదరణ లభించడంతో కలెక్షన్లపరంగా మరో మెట్టునెక్కింది.

    చిచ్చోర్ చిత్రం కాలేజ్ హాస్టల్ డేస్‌ నేపథ్యంగా స్నేహితుల ప్రేమ, ఆప్యాయతలు, మనస్పర్దలు ఆధారంగా తెరకెక్కింది. ఢిల్లీ బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమాను నితీష్ తివారీ చక్కగా తెరకెక్కించారు. కథ, కథనాలు ఆకట్టుకోవడంతో థియేటర్లకు యూత్ ఆడియెన్స్ పోటెత్తారని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషించారు.

    ఇక బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు మంచి విజయాన్ని అందించింది. ఎంఎస్ ధోని సినిమా తర్వాత మరో రూ.100 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకొన్నాడు. ఈ చిత్ర విజయంతో మరింత జోష్‌ను కూడగట్టుకొన్నాడు.

    English summary
    Actress Shraddha Kapoor's Chhichhore crosses 150 crores at box office. Sushant Singh Rajput and Shraddha Kapoor's movie shown good perfomance. This movie is second 100 crores movie for Sushant Career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X