సాహో లాభాలకు శ్రద్ధాకపూర్ బొక్క.. ప్రభాస్ స్టామినాకు ధీటుగా!
దేశీయ బాక్సాఫీస్ వద్ద అందాలభామ శ్రద్దాకపూర్ హవా కొనసాగుతున్నది. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌తో జతకట్టి నటించిన సాహో చిత్రంతో శ్రద్ద భారీ విజయాన్ని అందుకొన్నది. సాహో రిలీజ్ అనంతరం పది రోజుల గ్యాప్‌తో మళ్లీ చిచ్చోర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న చిత్రంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది.

తొలివారంలో
చిచ్చోర్ సినిమా తొలి రోజు ఘనమైన వసూళ్లతో ఖాతాను ప్రారంభించింది. తొలి రోజు శుక్రవారం రూ.7.32 కోట్లు, శనివారం రూ.12.25 కోట్లు, ఆదివారం రూ.16.41 కోట్లు వసూలు చేసింది. తొలి వారాంతంలో వచ్చిన మౌత్ టాక్‌తో చిత్‌చోర్ సోమవారం రూ.8.10 కోట్లు వసూలు చేసింది. సోమవారం రూ.8.10 కోట్లు, మంగళవారం రూ.10.05, బుధవారం రూ.7.20 కోట్లు, గురువారం రూ.7.50 కోట్లు వసూలు చేసింది.
Recommended Video

అంచనాలను అధిగమించి
చిచ్చోర్ అన్ని రకాల అంచనాలను, ఎస్టిమేషన్స్, కాలుక్యేషన్స్‌ను అధిగమించింది. తొలివారంలో భారీ గణాంకాలను నమోదు చేసింది. తొలివారంలో రూ.68.83 కోట్ల వసూళ్లను సాధించింది. ఇదే ఊపు కొనసాగితే త్వరలోనే రూ.100 కోట్ల వసూళ్లను సాధించే అవకాశం ఉంది అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

దంగల్ సినిమా తర్వాత
దంగల్ సినిమాను రూపొందించిన నితీష్ తివారీ చిచ్చోర్ సినిమాను తెరకెక్కించారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా, శ్రద్ధాకపూర్ తదితరులు నటించారు. తొలుత ఈ సినిమాకు సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వ్యక్తమైంది. కానీ ప్రేక్షకుల ఆదరణ పెరగడంతో మంచి వసూళ్లు సాధిస్తున్నది.

డ్రీమ్ గర్ల్ గట్టిపోటి
బాలీవుడ్‌లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా కొనసాగుతున్నది. చిచ్చోర్‌తోపాటు ఇటీవల విడుదలైన డ్రీమ్ గర్ల్ సినిమా కూడా భారీ ఓపెనింగ్స్ సాధించింది. డ్రీమ్ గర్ల్ చిత్రం తొలి రోజున రూ.10.05 కోట్లు సాధించింది. చిచ్చోర్‌కు డ్రీమ్ గర్ల్ గట్టిపోటి ఇస్తున్నది. అంతేకాకుండా ఈ రెండు చిత్రాలు సాహోకు ధీటుగా వసూళ్లను సాధించడం కూడా ట్రేడ్ వర్గాల్లో ఉత్సాహాన్ని పెంచింది.


Click it and Unblock the Notifications











