Drishyam 2 day 5 collections బాలీవుడ్‌లో దృశ్యం 2 కలెక్షన్లు జోరు.. 5వ రోజు కూడా భారీ వసూళ్లు

పనోరమ స్టూడియోస్, యష్ రాజ్ ఫిల్మ్స్, ఫార్స్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్లపై రూపొందిన దృశ్యం 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నది. గత కొద్ది నెలలుగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధించలేకపోయతున్న బాలీవుడ్‌కు దృశ్యం 2 చిత్రం జోష్‌ను పెంచింది. మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో వెంకటేష్ నటించిన దృశ్యం చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

దృశ్యం 2 సినిమాకు సినీ విమర్శకులు సానుకూలంగా స్పందించడంతో బాక్సాఫీస్ జర్నీ ఘనంగా మొదలైంది. ఒకటో రోజు ఈ సినిమా 15.38 కోట్లు, రెండో రోజు 21.59 కోట్లు, మూడో రోజు 27.13 కోట్లు, నాలుగో రోజు 11.87 కోట్లు రాబట్టింది. అయితే సోమవారం రోజున కూడా ఈ సినిమా స్ట్రాంగ్‌గా నిలబడటంతో ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Shriya Sarans Drishyam 2day 5 expected Box Office Collections worldwide

అజయ్ దేవగన్, శ్రీయ సరన్, అక్షయ్ ఖన్నా, టబు నటించిన దృశ్యం 2 చిత్రం ఐదో రోజున కూడా భారీగా వసూళ్లను రాబట్టిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఐదో రోజున ఈ చిత్రం 10.65 కోట్ల మేర వసూలు చేయవచ్చని తెలిపారు. ఒకవేళ ఈ రేంజ్ కలెక్షన్లు సాధిస్తే.. 89.66 కోట్ల రూపాయలను నమోదు చేసే అవకాశం ఉంది.

దృశ్యం 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద 2022 ఏడాది రికార్డు స్థాయి వసూళ్లను సాధించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.

నటీనటులు: అజయ్ దేవగన్, టబు, అక్షయ్ ఖన్నా, శ్రీయ సరన్, ఇషితా దత్తా, రజత్ కపూర్, సౌరవ్ శుక్లా తదితరులు
దర్శకత్వం: అభిషేక్ పాథక్
స్క్రీన్ ప్లే: అభిషేక్ పాథక్, ఆమిల్ కీయాన్ ఖాన్
కథ: జీతూ జోసెఫ్
నిర్మాతలు: భూషణ్ కుమార్, కృషన్ కుమార్, కుమార్ మంగత్ పాథక్ తదితరులు
సినిమాటోగ్రఫి: సుధీర్ కే చౌదరీ
ఎడిటింగ్: సందీప్ ప్రాన్సిస్
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
రిలీజ్: 2022-11-18

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X