అరుంధతిని అంతకిచ్చేస్తారా?

ఇక రిలీజైన పదిహేను రోజులు తర్వాత భారీ ఎత్తున కురుస్తున్న కలెక్షన్స్ వర్షం చూసిన ఆ ప్రముఖుడు మళ్ళీ ఫోన్ చేసి శ్యామ్ ని శాటిలైట్ రైట్స్ తనకివ్వమని అడిగారు. దానికి శ్యామ్ ఏడు కోట్ల ఎమౌంట్ చెప్పారు. ఆ పెద్దాయన ఒప్పుకోకపోవటంతో ఆ రైట్స్ శ్యామ్ దగ్గరే ఉన్నాయి. అయితే ఇప్పటికే పలు ఛానెల్స్ ఫ్యాన్సీ ఆఫర్స్ తో శ్యామ్ ని సంప్రదిస్తూండటంతో ఆయన మంచి రేటు దగ్గర ఆగాక అమ్ముదామనే నిర్ణయానికి వచ్చారు. ఇక అరుంధతి ఇప్పటికే తన పెట్టుబడిని దాటి కలెక్టు చేసినట్లు సమాచారం.
ఈ సినిమా నిర్మాతకే కాక అరుంధతి గా వేసిన అనూష్క కెరీర్ కి సైతం లాభం తెచ్చిపెట్టింది. ఈ సినిమా హిట్టుని పురస్కరించుకుని అనూష్క దాదాపు కోటి వరకూ తన రెమ్యునేషన్ ని పెంచినట్లు సమాచారం. ఇక ఈ సినిమా వల్ల పెద్దగా ఉపయోగపడని టెక్నీషియన్ దర్శకుడు కోడి రామకృష్ణ. ఆయన పెరుని పెద్దగా హైలెట్ చేయకపోవటంతో ఆయనకు ఈ సినిమా తెచ్చిన ఆఫర్స్ ఏమీలేకపోవం విశేషం.


Click it and Unblock the Notifications











