విడుదలకు ముందే భారీ స్థాయిలో ప్రాఫిట్స్ అందించిన శ్యామ్ సింగరాయ్.. నాని కెరీర్ లోనే అత్యధికంగా..
నాచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త పాయింట్ భిన్నమైన తరహాలో ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సపోర్ట్ లేకుండా సోలో గా ఎదిగిన నాని ప్రతి సినిమాతోనకుడా తనను తాను సరికొత్తగా పరిచయం చేసుకుంటున్నాడు. ఇక త్వరలోనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకులకు మరింత భిన్నంగా దగ్గరవ్వాలని చూస్తున్నారు. అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో తన మార్కెట్ ను కూడా పెంచుకోవాలని అనుకుంటున్నాడు. అయితే ఆ సినిమా విడుదలకు ముందే నాన్ థియేట్రికల్ గా మంచి లాభాలను అందించినట్లు సమాచారం.

సౌత్ లో బిగ్ మార్కెట్ కోసం
ఇటీవల కాలంలో నాని తన మార్కెట్ స్థాయిని మరింత పెంచుకునే విధంగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర హీరోలు పాన్ ఇండియా సినిమా అంటూ చాలా పెద్ద టార్గెట్ సెట్ చేసుకుంటున్నారు. ఇక నాని ముందుగా ఆ రేంజ్ లో కాకుండా సౌత్ ఇండస్ట్రీ లో మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. శ్యామ్ సింగరాయ్ సినిమా తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ భాషల్లో కూడా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

ఇద్దరు హీరోయిన్స్
టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. పీరియడ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నానికి జోడిగా ఇద్దరు హీరోయిన్స్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు. సాయి పల్లవి తో పాటు ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కూడా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

బడ్జెట్ కు తగ్గట్టుగానే..
శ్యామ్ సింగరాయ్ సినిమా ఈ నెల 24న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక సినిమా బడ్జెట్ కు తగ్గట్టుగానే మార్కెట్ పరంగా కూడా నిర్మాతలకు ఆనందాన్ని ఇస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో దాదాపు 40 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే విడుదలకు ముందే థియేట్రికల్ గా కూడా శ్యామ్ సింగరాయ్ సినిమాకు మంచి లాభాలు వచ్చినట్లు సమాచారం.

20కోట్ల లాభం..
సినిమా థియేట్రికల్ బిజినెస్ ను పక్కనపెడితే ముందుగా డిజిటల్ శాటిలైట్ పరంగా ఈ రోజుల్లో సినిమాలు చాలా మంచి లాభాలను అందిస్తున్నాయి. ఏక్ నాని కెరీర్ లో కూడా అత్యధికంగా శ్యామ్ సింగరాయ్ శాటిలైట్ హక్కులు పది కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ప్రముఖ జెమినీ టీవీ సంస్థ ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా కూడా శ్యామ్ సింగరాయ్ సినిమాకు 10 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది అంటే ఈ రెండు దారులోన సినిమాకు 20 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి.

బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్స్ పై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆ రూట్లో కూడా సినిమా మంచి లాభాలను అందించేది అంటే దాదాపు 30 కోట్ల వరకు థియేట్రికల్ గా ప్రాఫిట్స్ వచ్చినట్లు లెక్క. ఇక థియేట్రికల్ బిజినెస్ పరంగా నాని కి మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఆ దారిలో మరొక 20 కోట్ల షేర్ ను రాబట్టిన కూడా ఈజీగా నిర్మాతలు ప్రాఫిట్స్ లోకి వస్తారు. కానీ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరంగా దాదాపు 45 కోట్లకు పైగా వసూళ్లను అందుకోగలిగితే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయినట్లు లెక్క.


Click it and Unblock the Notifications











