ఆ ఒక్కటే హిట్టు(ట్రేడ్ టాక్)

అలాగే సత్యమేవ జయితే చిత్రం ఒరిజనల్ బాలీవుడ్ కథని మార్చి, అందులో చిరంజీవి మీద సెటైర్స్ పెట్టి అసలు కథనం పై దృష్టి పెట్టారు.దాంతో అదీ పస లేని వ్యవహారంగా మారిపోయింది. ఇక అంతకు ముందు రిలీజైన కొంచెం ఇష్టం..కొంచెం కష్టం..ధియోటర్ల వద్ద చాలా కష్టంగా ఉంది. బాలా నేనే దేముడ్ని సినిమా చూసిన వారికి నిజంగా దేముడు కన్పడనుండటంతో దానికీ ప్రేక్షకాదరణ లేదు. అరుంధతే ఇప్పటికీ టాప్ ఛెయిల్ లో ఉంది. నిజాయితీగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి చేసిన ప్రయత్నానికి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు.
అయితే ఆర్ధికమాద్యం ఎఫెక్టు కొంత వరకూ పరిశ్రమపై పడిందంటున్నారు నిపుణులు. రియల్ ఎస్టేట్ కుదేలవటంతో చిన్న సినిమాలు ఏవీ ప్రారంభం కావటం లేదు. దాంతో చాలా మంది ఖాళీగా ఉండాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది. అలాగే వరసగా రిలీజైన ప్రతీ సినిమా ఫ్లాప్ అవటం కూడా మార్కెట్ లో ఉత్సాహం లేకుండా చేస్తోంది. ఇక ఈ రోజు తారకరత్న వెంకటాద్రి, నితిన్ ద్రోణ, ఛార్మి 16 డేస్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.వాటి భవిష్యత్ తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











