సిద్దార్థ్ ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ఫైనల్ రిజల్ట్ ఏంటి?
అయితే సిద్దార్ధ వరస సినిమాలు ప్లాప్ కావటం...మైనస్ గా మారింది. అలాగే లవ్ గురు పాత్రలో బ్రహ్మానందం నవ్వించినా.. సునీల్ వంటి కామెడీ హీరో ఉంటే బాగుండేది అనేది సర్వత్రా వినపడుతోంది. అయితే సినిమాకి వెళ్లినవాళ్లకు నవ్వులు గ్యారెంటీ కావంటతో ఫస్ట్ షో,సెకండ్ షోలు రన్ బాగుంటోందని తెలుస్తోంది. అలాగే వీకెండ్స్ లో కలెక్షన్స్ బాగున్నాయి.
నిర్మాత బి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... ''థియేటర్ నుంచి బయటికొచ్చిన తర్వాత కూడా ఆ సినిమా మనల్ని వెంటాడితే అది పెద్ద హిట్ కింద లెక్క. ఈ సినిమా ఆ కోవలోకే వస్తుంది. ప్రారంభం నుంచి చివరి వరకు కామెడీ ఉండటంతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా సంస్థలో వచ్చిన అనువాద చిత్రాలు హిట్ అయ్యాయి. ఇప్పుడీ స్ట్రయిట్ చిత్రం విజయం సాధించడం ఆనందంగా ఉంది'' అన్నారు
అలాగే ...''సిద్ధార్ధ్‌కి యూత్ ఫాలోయింగ్ ఉంది. 'బొమ్మరిల్లు'తో ఫ్యామిలీస్‌లో కూడా ఫాలోయింగ్ వచ్చింది. ఈ రెండు వర్గాలూ చూస్తున్నాయి కాబట్టే సినిమా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఈ సినిమాకి బ్రహ్మానందం ఓ హీరో. ద్వందార్థాలు లేని కామెడీ ఉండటంతో ప్రేక్షకులు హాయిగా ఆస్వాదిస్తున్నారు. ఇందులో ఉన్న పాటల్లో జపాన్‌లో తీసిన రెండు పాటలు విజువల్‌గా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఓవర్సీస్, కర్నాటకల్లోనూ ఆదరణ లభిస్తోంది. తమిళంలో 25 సినిమాల వరకూ దర్శకత్వం వహించిన సుందర్‌కి తెలుగులో మా సంస్థ ద్వారా హిట్ రావడం ఆనందంగా ఉంది'' అని చెప్పారు.


Click it and Unblock the Notifications












