twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ తో పోటీ పడటానకే సిద్దార్ద ప్రిపేర్ అవుతున్నాడు

    By Srikanya
    |

    పవన్‌ కళ్యాణ్‌ హీరోగా గా తమిళ దర్శకుడు విష్ణువర్ధన్‌ డైరక్షన్ లో రూపొందుతోన్న చిత్రం 'షాడో ' చిత్రం దశరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే రోజున సిద్దార్ద హీరోగా నూతన దర్సకుడు వేణు శ్రీరామ్ దర్సకత్వంలో రూపొందుతోన్న ఓ మై ప్రెండ్ చిత్రం కూడా విడుదల చేయాలని దిల్ రాజు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఓ మై ప్రెండ్ చిత్రం షూటింగ్ పిఫ్టీ పర్శంట్ పూర్తై పోయింది.ఈ దర్సకుడు గురించి దిల్ రాజు మాట్లాడుతూ..రాఘవేంద్రరావు, పూరి జగన్నాధ్ తరహాలో తాను చేస్తున్న విషయంపై పూర్తి క్లారిటీ ఉన్న దర్శకుడు వేణు శ్రీరామ్. అతనికి లాంగ్ స్టాండింగ్ ఉంటుందని అన్నారు. శృతి హాసన్, హన్సిక కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం స్నేహం, ప్రేమ చుట్టూ తిరిగే కథ అని చెప్తున్నారు.

    ఇక షాడో విషయానికి వస్తే..సంఘమిత్ర ఆర్ట్స్‌, ఆర్కా మీడియా వర్క్స్‌ ప్రై.లిమిటెడ్‌ ఆధ్వర్యంలో తిరుమలశెట్టి నీలిమ, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్‌ సరసన సారా జేన్‌ డయాస్‌, అంజలీ లావానియా నటిస్తున్నారు. దాదాపు నలభై పర్శంట్ షూటింగ్ జూలై 26 నాటికి పూర్తవుతుంది. అందుకని నిర్మాతలు ఈ చిత్రం దశరాకు విడుదల చేయవచ్చని నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు విష్ణువర్ధన్‌ మాట్లాడుతూ...'ఆద్యంతం ఆసక్తికరంగా నడిచే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. పవన్‌ అభిమానులను ఆకట్టుకునే అంశాలతో సినిమా చాలా స్టెయిలిష్‌గా ఉంటుంది' అన్నారు. జాకీష్రాఫ్, అడవి శేష్, అతుల్ కులకర్ణి, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాహుల్ కోడా, కెమెరా .ఎస్.వినోద్, కూర్పు ఎ.శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్ శ్యామ్ కౌశల్, కళ సునీల్‌బాబు.ఈ రెండు చిత్రాల్లో ఏది విన్నవుతుందో చూడాలి.

    English summary
    Siddharth’s next film, O My Friend is currently being shot in Hyderabad. So far, 50% of the film has been shot. Shruti Hassan and Hansika play the lead roles in the film. Venu Sriram is directing it and Dil Raju is producing the film on Sri Venkateswara Creations banner. Dil Raju is hopeful that the film might hit the screens for Dusshera.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X