'ఓయ్' ఏమైంది?
సిద్ధార్థ, షామిలి జంటగా క్రితం శుక్రవారం రిలీజ్ ఐన "ఓయ్" చిత్రం డివైడ్ టాక్ తో ముందుకు వెళ్తోంది. సిద్ధార్థ హీరో కావడంతో ఓపెనింగ్స్ బాగానే ఉన్నా కొన్ని వర్గాలు వారికి నీరసమైన క్లైమాక్స్ నచాక పోవటం,సెకండ్ హాఫ్ లాగటం బోర్ అని ఫీల్ అవటం తో అలాగే మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. అయితే కాలేజీ యూత్ ని మాత్రం ఈ ఫిలిం ఐస్కాంతంలా లాగటం ప్లస్ అయింది. అందులోను అంజలి పాపగా పాపులర్ ఐన షామిలి యౌక్త వయస్సులోకి వచ్చిన తర్వాతా చేసిన మొదటి ఫిలిం కావటం కలిసి వస్తోంది.
ఉదయ్ (సిద్దార్ధ) తన ప్రియురాలు సంధ్య (షామిలి) జ్ఞాపకాలను గుర్తు చేసికోవటంతో కథ మొదలౌతుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఉదయ్ ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త కొడుకు. ప్రతిక్షణాన్ని ఎంజాయ్ చేయాలనుకునే రకం. అందుకు పూర్తి భిన్నమైన వైజాగ్ అమ్మాయి సంధ్య (షామిలి). ఒకరోజు తన బర్త్ డే వేడుకను ఓ పబ్ లో జరుపుకొంటున్న టైం లో ఫ్రెండ్ బలవంతం మీద అక్కడుకు వచ్చిన సంధ్య సిద్దార్థ కంటపడుతుంది. 'ఓయ్' అంటూ ఆమె పిలిచిన పిలుపుతో అతను ప్రేమలో పడి పోతాడు. దాతో ఆమె ప్రేమ పొందేందుకు రక రకాల ట్రిక్స్ ప్లే చేస్తాడు. అంతే గాక లీగల్ సమస్యల్లో ఉన్న సంధ్య ఇంటిని ఆమెకు ఇప్పించడంలో సహాయపడతాడు. మెల్లిగా ఆమె ఇంట్లో మకాం వేస్తాడు. సంధ్య కోరుకునే వ్యక్తిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనేది తెలివిగా తెలుసుకుని అట్నించి పావులు కదుపుతాడు. వీటి పలితంగా సంధ్య కూడా ఉదయ్ పట్ల అభిమానం పెంచుకుంటుంది. అది ప్రేమగా రూపొందుతుంది. ఇక మరింత ముందుకు ప్రొసీడ్ అవుదమనుకొనే సరికల్లా ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. ఆ తరవాత వచ్చే మార్పులే సెకండ్ హాఫ్.
అ మిలియనీర్ ఫస్ట్ లవ్ అనే కొరియా చిత్రం ఆధారం గా వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ లోని కామెడీ ని ప్రక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సునీల్ కామెడీ మాత్రం బోర్ ఫీల్ ఔతున్నట్లు చెప్తున్నారు. అందులోనూ గతం లో నాగార్జున హీరో గా వచ్చిన గీతాంజలి పోలికలు జనాలని చీకాకు పరుస్తునాయి. అయితే చిత్రం మాత్రం టెక్నికల్ గా బాగుందని అన్ని వర్గాలు నుండి వినపడుతోంది. మరో వారం ఆగితే గాని పూర్తి పలితం తేలదు. ఎంత నచ్చినా మల్టీ ప్లేక్స్ దాటటం కష్టమే నని సిని పెద్దలు అంతం గమనార్హం.


Click it and Unblock the Notifications











