సిద్దార్ధ, వరుణ్ కష్ట కాలం(ట్రేడ్ టాక్)
క్రితం వారం రిలీజ్ అయిన ఓయ్, రాత్రి, నింగి నేలా నాదే చిత్రాలలో ఓయ్ మాత్రమే ఓపెనింగ్ లు తెచ్చుకుంది. అయితే చిత్రం నిలబడే వాతావరణం మాత్రం కనపడటం లేదు. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి జనం అనాసక్తితో కదులుతున్నారు. దానితో మౌత్ టాక్ సరిగ్గా పుట్టక రిపీట్ ఆడియన్స్ లేక రెండవ వారానికే కలెక్షన్స్ పరంగా ఇబ్బందిని ఎదురుకునే వాతావణం కనపడుతోంది.ఇక చల్ల భాను కిరణ్ డైరక్షన్ లో వచ్చిన రాత్రి సినిమా అటు హర్రర్ కాక ఇటు థ్రిల్లర్ కాక జనానికి టెర్రర్ మిగులోస్తోంది .చైనా చిత్రం 'ఇన్విజిబుల్ వింగ్స్' తెలుగు డబ్బింగ్ 'నింగీ..నేల..నాదే' చిత్రం అందరి మన్ననలు పొందుతున్నా, మహేష్ వంటి హీరో ల తో చెప్పిచి పబ్లిసిటీ చేస్తున్నా పలితం కనపడం లేదు.
ఇక అంతకు ముందు వారం రిలీజ్ అయిన ఎవిఎం వారి "ఎవరైనా ఎపుడైనా" కూడా పూర్తి గా డ్రాప్ అయింది. "రాజు మహారాజు", "స్వీట్ హార్ట్" చిత్రాలు అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. నాగబాబు "అంజనీ పుత్రుడు", జంక్షన్ ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోలేక పోతున్నై. సుశాంత్ "కరెంట్" ఎప్పుడో కూలబడింది. ఇక సిద్దార్ధ,అతనికి డూప్ లా ఉండే వరుణ్ సందేశ్ ఇద్దరు వారం తేడాలో లవ్ స్టొరీ లతో ముందుకు వచ్చి చతికిలి పడటం అందరని ఆలోచనలో పడేస్తోంది. ప్లాప్ లు రాని వరుణ్ కి, సిద్దార్ధ కి కష్ట కాలం ప్రారంభ మొదలైందా అనే సందేహాలు కలుగుతున్నై.


Click it and Unblock the Notifications











