Takkar Collections తెలుగు, తమిళంలో టక్కర్ కలెక్షన్ల పరిస్థితి ఏమిటి? ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్, పాషన్ స్టూడియోస్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం టక్కర్. యువ హీరో, హీరోయిన్లు సిద్దార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వం వహించారు. యాక్షన్, లవ్ అంశాలతో రోడ్ జర్నీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే...
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ వద్ద శిష్యరికం చేసిన దర్శకుడు కార్తీక్ జీ క్రిష్ తొలిసారి దర్శకత్వం వహిస్తూ టక్కర్ సినిమాను భారీగా రూపొందించారు. యాక్షన్, వెహికిల్ ఛేజింగ్ సీన్లను రిచ్‌గా తెరకెక్కించారు. టెక్నికల్‌గా బెస్ట్ టెక్నిషియన్స్ పనిచేయడం జరిగిందని సిద్దార్థ్ ఇటీవల తెలిపారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారు 20 కోట్ల రూపాయల మేర అయిందనేది ట్రేడ్ వర్గాల సమాచారం.

టక్కర్ సినిమా టీజర్లు, ట్రైలర్లు భారీ క్రేజ్‌ను సంపాదించిపెట్టాయి. సిద్దార్థ్, దివ్యాంశ చేసిన ప్రమోషన్స్ మరింత బజ్‌ను క్రియేట్ చేశాయి. దాంతో ఈ సినిమాకు అంచనాలు కూడా భారీగానే పెరిగాయి. దాంతో ఈ సినిమాను తెలుగు, తమిళ రాష్ట్రాల్లో తక్కువలో తక్కువ 800 స్క్రీన్లకుపైగానే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
టక్కర్ సినిమా ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. తమిళంలో ఈ చిత్రం మార్నింగ్ షోకు 15 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీ 20 శాతం, ఫస్ట్ షోకు 20 శాతం, సెకండ్ షోకు 25 శాతం ఆక్యుపెన్సీ ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తొలి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఆక్యుపెన్సీలో పెరుగుదల కనిపించలేదని పేర్కొన్నారు.

ఇక తెలుగులో కూడా సాధారణ ప్రేక్షకులను, సినీ విమర్శకులను టక్కర్ మూవీ మెప్పించలేకపోయింది. దాంతో తొలి రోజు భారీగా ఆక్యుపెన్సీ నమోదు కాలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో మార్నింగ్ షోకు 18 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 20 శాతం ఆక్యుపెన్సీ, ఫస్ట్ షోకు 20 శాతం, సెకండ్ షోకు 25 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
అలాగే టక్కర్ మూవీ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు, తమిళంలో ఓ మోస్తారు కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. తమిళంలో 2 నుంచి 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఇక తెలుగులో కూడా ఆ రేంజ్‌లోనే అంటే.. 2 కోట్ల రూపాయల నుంచి 2.5 కోట్ల మేర వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా సుమారు 5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











