DJ Tillu Day 1 Collections: మొదటిరోజే దద్దరిల్లిన బాక్సాఫీస్.. ఇలానే కొనసాగితే బీభత్సమే
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత మళ్లీ బాక్సాఫీస్ సందడి మొదలయ్యింది. అఖండ పుష్ప లాంటి భారీ విజయాలను అనంతరం శ్యామ్ సింగరాయ్ సినిమాతో నాని కూడా పర్వాలేదు అనిపించే విధంగా తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచాడు. ఇక కఠిన సమయంలో మరొక సినిమా కూడా మంచి విజయాన్ని అందుకునే విధంగా ముందుకు సాగుతోంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు అందుకుంది. సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే వివరాల్లోకి వెళితే...

మంచి విజయాన్ని అందుకోవాలని..
గత కొంతకాలంగా నటుడిగా మంచి గుర్తింపు అందుకునే విధంగా ముందుకు సాగుతున్న సిద్దు జొన్నలగడ్డ కొన్ని డిఫరెంట్ సినిమాలు చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సరైన మార్కెట్ అయితే క్రియేట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు ఎలాగైనా డీజే సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని సిద్ధమయ్యాడు. సినిమాకు సంబంధించిన ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేసింది.

భారీగా అడ్వాన్స్ బూకింగ్స్
సితార ఎంటర్టైన్మెంట్లో నాగవంశి నిర్మించిన ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. సిద్దు హీరోగానే కాకుండా సినిమాకు ప్రత్యేకంగా కథ స్క్రీన్ ప్లే ను కూడా అందించాడు. ఇక విడుదలకు వారం ముందు రోజుల నుంచే ఈ సినిమా బుకింగ్స్ మొదలవగా భారీ స్థాయిలో ఆన్లైన్ లో టిక్కెట్లు అమ్ముడయ్యాయి.

ప్రీ రిలీజ్ బిజినెస్..
డిజే టిల్లు సినిమా రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే..
నైజాంలో 2.80కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఉత్తరాంధ్ర, ఈస్ట్‌లో కూడా ఈ సినిమా మంచి బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. వెస్ట్, గుంటూరు, కృష్ణా, నెల్లూరులో ఇలా ఏపీ తెలంగాణ లో మొత్తంగా రూ. 7.70 కోట్లు వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 0.60కోట్లు, ఓవర్సీస్ లో 0.65కోట్లు, ఇక వరల్డ్ వైడ్ గా 8.95కోట్ల వరకు ధర పలికినట్లు తెలుస్తోంది..

మొదటి రోజు కలెక్షన్స్
డీజే టిల్లు సినిమాకు మొత్తానికి మొదటిరోజు అనుకున్నట్లుగానే భారీ స్థాయిలో వసూలు అందాయి. ఏరియాల వారీగా వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో 1.59కోట్లు, సీడెడ్ లో 47లక్షలు, ఉత్తరాంధ్రలో 26లక్షలు, ఈస్ట్ 18 లక్షలు, వెస్ట్ 32 లక్షలు, గుంటూరు 15 లక్షలు, కృష్ణ 11 లక్షలు, నెల్లూరు 10 లక్షలు.. ఏపీ తెలంగాణలో వచ్చిన మొత్తం షేర్ 3.18కోట్లు.

ప్రపంచవ్యాప్తంగా
మొదటిరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 3.18కోట్లు అందుకున్న డీజే టిల్లు 5.93కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను అందుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 0.25కోట్లు ఓవర్సీస్ లో 0.90కోట్లు వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్ గా 4.33కోట్లు షేర్ రాగా 8.10కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కినట్లు తెలుస్తోంది.

అక్కడ కూడా..
అమెరికాలో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 2022 లో ఇప్పటివరకు ఫస్ట్ డే అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా కూడా డీజే రికార్డ్ క్రియేట్ చేయబోతోంది నట్లుగా తెలుస్తోంది. యూఎస్ లో సినిమాకు ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటిరోజు 200k డాలర్స్ అందుకున్నట్లు సమాచారం

ఇలానే కొనసాగితే..
వరల్డ్ వైడ్ గా 8.95కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డీజే టిల్లు 9.50కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదల అయ్యింది. ఇక మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 4.33కోట్ల షేర్ రాబట్టిన డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వాలి అంటే మరో 5.17కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. ఇలానే కొనసాగితే పెట్టిన పెట్టుబడులకు సినిమా బీభత్సం సృష్టిస్తుంది అని చెప్పవచ్చు. మరి సినిమా రెండవ రోజు ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











