DJ Tillu Day 2 Collections: రెండవ రోజు కూడా టిల్లుగాడి దూకుడు.. మరో 2కోట్లు వస్తే రికార్డ్ బ్రేక్!

సిద్దు జొన్నలగడ్డ, నేహా శర్మ జంటగా నటించిన డీజే టిల్లు సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక సినిమాకి విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక విడుదల అనంతరం కూడా అదే తరహాలో ఓ వర్గం ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. మొత్తానికి డీజే టిల్లు ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకున్నాడు. ఇక రెండవరోజు కూడా అదే దూకుడుతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు దగ్గరకు వచ్చేశాడు. ఇక సినిమా రెండవ రోజు అందుకున్న టోటల్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే వివరాల్లోకి వెళితే..

విడుదలకు ముందే..

విడుదలకు ముందే..

హారిక హాసిని అనుబంధ సంస్థ సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో విమల్ కృష్ణ నిర్మించిన డీజే టిల్లు సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడం మరింత బెన్ఫిట్ అయ్యింది. ఇక సినిమా విడుదలకు ముందు టీజర్ ట్రైలర్ తో బజ్ క్రియేట్ చేయడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. సినిమా ఎక్కువగా యూత్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసింది. ఇక అనుకున్నట్లే మొదటిరోజు పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది.

Recommended Video

DJ Tillu Box Office Collections, ఆ రికార్డు అందుకున్న మొదటి సినిమాగా DJ Tillu | Filmibeat Telugu
ప్రీ రిలీజ్ బిజినెస్..

ప్రీ రిలీజ్ బిజినెస్..

డిజే టిల్లు మూవీ మొత్తానికి ఒక వారంలోనే బిజినెస్ స్థాయిని ఒక్కసారిగా పెంచేసుకుంది. నైజాంలో 2.80కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఉత్తరాంధ్ర, ఈస్ట్‌లో కూడా ఈ సినిమా మంచి బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. వెస్ట్‌, గుంటూరు, కృష్ణా, నెల్లూరులో ఇలా ఏపీ తెలంగాణ లో మొత్తంగా రూ. 7.70 కోట్లు వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 0.60కోట్లు, ఓవర్సీస్ లో 0.65కోట్లు, ఇక వరల్డ్ వైడ్ గా 8.95కోట్ల వరకు ధర పలికినట్లు తెలుస్తోంది..

రెండవ రోజు కలెక్షన్స్

రెండవ రోజు కలెక్షన్స్

డీజే టిల్లు సినిమాకు మొత్తానికి మొదటిరోజు అనుకున్నట్లుగానే భారీ స్థాయిలో వసూలు అందాయి. ఏరియాల వారీగా వచ్చిన రెండవ రోజు కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో 1.41కోట్లు, సీడెడ్ లో 34లక్షలు, ఉత్తరాంధ్రలో 24లక్షలు, ఈస్ట్ 15 లక్షలు, వెస్ట్ 13 లక్షలు, గుంటూరు 14 లక్షలు, కృష్ణ 12 లక్షలు, నెల్లూరు 19 లక్షలు.. ఏపీ తెలంగాణలో వచ్చిన మొత్తం షేర్ 2.62 కోట్లు

రెండు రోజుల టోటల్ కలెక్షన్స్

రెండు రోజుల టోటల్ కలెక్షన్స్

రెండవ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 2.62కోట్లు షేర్ అందుకున్న డీజే టిల్లు 4.90కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను అందుకున్నట్లు తెలుస్తోంది. మొత్త రెండు రోజుల్లో 5.80కోట్ల షేర్ దక్కింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 0.45కోట్లు ఓవర్సీస్ లో 1.25కోట్లు వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్ గా 7.50కోట్లు షేర్ రాగా 13.80కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కినట్లు తెలుస్తోంది.

టార్గెట్ కు దగ్గరలోనే..

టార్గెట్ కు దగ్గరలోనే..

ప్రపంచవ్యాప్తంగా గా 8.95కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డీజే టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద 9.50కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదల అయ్యింది. ఇక రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 7.50కోట్ల షేర్ రాబట్టిన డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వాలి అంటే మరో 2కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. ఆ రికార్డును ఈ రెండు రోజుల్లో పూర్తి చేస్తే రికార్డును బ్రేక్ చేసినట్లే. ఈ ఏడాది చాలా వేగంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకున్న మొదటి సినిమాగా డీజే టిల్లు రికార్డు క్రియేట్ చేసే అవకాశం ఉంది. మరి సోమ మంగళవారం రోజులలో ఈ సినిమా మరో రెండు కోట్ల షేర్ ను అందుకుంటుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X