DJ Tillu 8 Days Collections: టిల్లు గాడు రెచ్చిపోతున్నాడుగా.. అనుకున్నదానికంటే ఎక్కువ లాభాలు

సిద్దు జొన్నలగడ్డ, నేహా శర్మ జంటగా నటించిన డీజే టిల్లు సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలతో ముందుకి సాగుతోంది. మొదటివారంతరంలోనే సినిమా పెట్టిన పెట్టుబడులను దాదాపు వెనక్కి తెచ్చేసింది. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా వివిధ కారణాల వలన వాయిదా పడిన విషయం తెలిసిందే. మొత్తానికి గ్రాండ్ గా విడుదలైన డీజే టిల్లు ఫస్ట్ వీక్ లోనే ప్రాఫిట్స్ తో కొనసాగుతున్నాడు. ఇక సినిమాకు 8వ రోజు ఏ స్థాయిలో వసూళ్లను అందుకున్నాయి అనే వివరాల్లోకి వెళితే..

Recommended Video

DJ Tillu : Sidhu Jonnalagadda Exclusive Interview పుష్ప లాగే టిల్లు.. | Filmibeat Telugu
 సొంతంగా కథ రాసుకున్న హీరో

సొంతంగా కథ రాసుకున్న హీరో

డీజే టిల్లు సినిమాతో మొత్తానికి సిద్దు జొన్నలగడ్డ బాక్సాఫీస్ వద్ద మొదటి విజయాన్ని అందుకున్నాడు. గత కొంత కాలంగా ఎన్నో సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా బాక్సాఫీసు వద్ద సరైన గుర్తింపు దక్కలేదు. ఇక ఈ సారి తనే సొంతంగా కథ రాసుకున్న సిద్ధూ తనకు అత్యంత సన్నిహితుడైన విమల్ కు దర్శకత్వం వహించే అవకాశాన్ని ఇచ్చాడు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా హీరో కథను నమ్మి మంచి బడ్జెట్ తో నిర్మించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రీ రిలీజ్ బిజినెస్

డీజే టిల్లు సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ అలాగే ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. దీంతో సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఇక ఏరియాల వారీగా సినిమా ఏ స్థాయిలో బిజినెస్ చేసింది అని వివరాల్లోకి వెళితే.. నైజాంలో 2.80కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఉత్తరాంధ్ర, ఈస్ట్‌లో కూడా ఈ సినిమా మంచి బిజినెస్ చేసింది. వెస్ట్‌, గుంటూరు, కృష్ణా, నెల్లూరులో ఇలా ఏపీ తెలంగాణ లో మొత్తంగా రూ. 7.70 కోట్లు వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 0.60కోట్లు, ఓవర్సీస్ లో 0.65కోట్లు, ఇక వరల్డ్ వైడ్ గా 8.95కోట్ల వరకు ధర పలికినట్లు తెలుస్తోంది.

8వ రోజు వచ్చిన కలెక్షన్స్

8వ రోజు వచ్చిన కలెక్షన్స్

ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'డీజే టిల్లు'కు మొదటి వారంలో మంచి వసూళ్లు అందాయి. 8వ రోజు ఏరియాల వారిగా వచ్చిన వసూళ్ళు ఈ విదంగా ఉన్నాయి. నైజాంలో రూ. 32 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి రూ. 60 లక్షలు షేర్, రూ. 1.00 కోట్లు గ్రాస్‌ను అందుకుంది.

8 రోజుల్లో టోటల్ కలెక్షన్స్

8 రోజుల్లో టోటల్ కలెక్షన్స్

8 రోజులకూ మొదటి వారం అనంతరం 'డీజే టిల్లు' ప్రాఫిట్స్ అందించే విధంగా ముందుకు సాగుతోంది. ఇక మొత్తం 8 రోజుల్లో ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్స్.. నైజాంలో రూ. 5.98 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.52 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.08 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 63 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 68 లక్షలు, గుంటూరులో రూ. 60 లక్షలు, కృష్ణాలో రూ. 51 లక్షలు, నెల్లూరులో రూ. 37 లక్షలతో కలిపి ఏపీ తెలంగాణలో రూ. 11.37 కోట్లు షేర్, రూ. 19.87 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా వచ్చింస్ షేర్ & గ్రాస్

ప్రపంచవ్యాప్తంగా వచ్చింస్ షేర్ & గ్రాస్

డీజే టిల్లు 8 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాకుండా మిగతా ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 84 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.83 కోట్లు రాబట్టింది. వీటితో కలుపుకుంటే 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 14.04 కోట్లు షేర్‌తో పాటు రూ. 24.80 కోట్లు గ్రాస్ సాధించింది.

మంచి ప్రాఫిట్స్..

మంచి ప్రాఫిట్స్..

విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన 'డీజే టిల్లు'కు అంచనాలకు తగ్గట్లుగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్లు మేర ప్రీ బిజినెస్ తో మార్కెట్ లోకి రాగా దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ మూవీ 9 రోజుల్లో రూ. 14.04 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో సినిమా ప్రాఫిట్స్ జోన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4.54 కోట్ల వరకు లాభాలను సొంతం చేసుకుంది. ఇక ఈ ఆదివారం కూడా సినిమా మంచి వసూళ్లను అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X