DJ Tillu 3 Days Collections: డీజే టిల్లుకు ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లోనే అన్ని కోట్లతో అరాచకం

గత ఏడాదితో పోలిస్తే ఈ సారి సంక్రాంతి సీజన్‌లో సినిమాలు పెద్దగా సందడి చేయలేదు. కరోనా ప్రభావం పెరగడంతో బడా చిత్రాలన్నీ వాయిదా పడిపోయాయి. దీంతో జనవరి నెల మొత్తం బాక్సాఫీస్ రన్ వెళవెళబోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఫిబ్రవరి సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'డీజే టిల్లు'.

Recommended Video

DJ Tillu Success Tour|Movie Team Visits Vijayawada Theatre| Siddu, Neha Shetty | Filmibeat Telugu

విడుదలకు ముందే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ మూవీ.. మంచి టాక్‌తో ప్రేక్షకుల స్పందనను అందుకుంటూ దూసుకుపోతోంది. ఫలితంగా కలెక్షన్లు కూడా బాగాన వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'డీజే టిల్లు' మూడు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లపై మీరూ ఓ లుక్కేయండి మరి!

‘డీజే టిల్లు' సందడి అదిరింది

‘డీజే టిల్లు' సందడి అదిరింది

సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ తెరకెక్కించిన చిత్రమే ‘డీజే టిల్లు'. ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు. దీనికి శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల సాంగ్స్ కంపోజ్ చేయగా.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, కిరీటి తదితరులు కీలక పాత్రలు చేశారు.

బిజినెస్ భారీగా.. రిలీజ్ గ్రాండ్‌గా

బిజినెస్ భారీగా.. రిలీజ్ గ్రాండ్‌గా

తెలుగు రాష్ట్రాల్లో సిద్దు జొన్నలగడ్డకు పెద్దగా మార్కెట్ లేదు. అయినప్పటికీ ‘డీజే టిల్లు' మూవీపై అంచనాలు ఉండడంతో రైట్స్‌కు పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్ల బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే ప్రేక్షకుల నుంచి దీనికి అదిరిపోయే స్పందన కూడా దక్కింది.

3వ రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత?

3వ రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత?

‘డీజే టిల్లు'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3వ రోజూ భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 73 లక్షలు, సీడెడ్‌లో రూ. 18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 15 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో కలిపి రూ. 1.40 కోట్లు షేర్, రూ. 2.20 కోట్లు గ్రాస్ వసూలైంది.

3 రోజులకూ కలిపి వచ్చిందెంత?

3 రోజులకూ కలిపి వచ్చిందెంత?

‘డీజే టిల్లు' మూవీకి మూడు రోజులకు కలిపి మంచి కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 3.73 కోట్లు, సీడెడ్‌లో రూ. 99 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 65 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 41 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 51 లక్షలు, గుంటూరులో రూ. 37 లక్షలు, కృష్ణాలో రూ. 30 లక్షలు, నెల్లూరులో రూ. 24 లక్షలతో కలిపి రూ. 7.20 కోట్లు షేర్, రూ. 13 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

వరల్డ్ వైడ్ కలెక్షన్లు రిపోర్టు ఇదే

వరల్డ్ వైడ్ కలెక్షన్లు రిపోర్టు ఇదే

తెలుగు రాష్ట్రాలతో పాటు ‘డీజే టిల్లు' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా మంచి వసూళ్లు వచ్చాయి. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 58 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.48 కోట్లు వసూలు చేసిందట. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 9.26 కోట్లు షేర్‌తో పాటు రూ. 16.80 కోట్లు గ్రాస్ కూడా వసూలు అయింది.

టార్గెట్ ఎంత? ఇంకెత వస్తే హిట్

టార్గెట్ ఎంత? ఇంకెత వస్తే హిట్

సిద్ధు హీరోగా నటించిన ‘డీజే టిల్లు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9.50 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో ఇది రూ. 9.26 కోట్లు రాబట్టింది. అంటే మరో రూ. 24 లక్షలు వస్తే క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X