twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    DJ Tillu 9 Days Collections: మళ్లీ పెరిగిన డీజే టిల్లు కలెక్షన్లు.. తెలుగులో టాప్ మూవీగా రికార్డు

    |

    తెలుగులో చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే, అందులో అన్నీ సక్సెస్ అవడం లేదు. మరీ ముఖ్యంగా 2022లో చాలా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ, కేవలం రెండంటే రెండు చిత్రాలు మాత్రమే హిట్ అయ్యాయి. అందులో 'డీజే టిల్లు' ఒకటి. టీజర్, ట్రైలర్, పాటలతో భారీ అంచనాలను ఏర్పరచుకుని ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. బజ్‌కు అనుగుణంగానే ఆడియెన్స్ నుంచి దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ఈ మూవీకి కలెక్షన్లు కూడా పోటెత్తాయి. దీంతో కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుందీ చిత్రం. ఈ నేపథ్యంలో ఈ మూవీ తొమ్మిది రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

    Recommended Video

    DJ Tillu Success Tour|Movie Team Visits Vijayawada Theatre| Siddu, Neha Shetty | Filmibeat Telugu
    ‘డీజే టిల్లు'గా సిద్ధు హల్‌చల్

    ‘డీజే టిల్లు'గా సిద్ధు హల్‌చల్

    సిద్దు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ రూపొందించిన సినిమానే ‘డీజే టిల్లు'. నేహా శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్ కంపోజ్ చేయగా.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ప్రిన్స్, బ్రహ్మాజీ ఇందులో కీలక పాత్రలు చేశారు.

    కొత్త షోలో శ్రీముఖి ఊహించని పని: అక్కడ చేయి వేయించుకుని మరీ అతడితో!కొత్త షోలో శ్రీముఖి ఊహించని పని: అక్కడ చేయి వేయించుకుని మరీ అతడితో!

    భారీగా బిజినెస్.. గ్రాండ్‌గా రిలీజ్

    భారీగా బిజినెస్.. గ్రాండ్‌గా రిలీజ్

    టాలీవుడ్‌లో చాలా ఏళ్లుగా సినిమాలు చేసినా సిద్దుకు పెద్దగా మార్కెట్ లేదు. అయినప్పటికీ ‘డీజే టిల్లు' మూవీ హక్కులకు విపరీతంగా పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్ల బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. అలాగే, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ కూడా అందుతోంది.

    9వ రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత?

    9వ రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత?

    ‘డీజే టిల్లు'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 9వ రోజూ మంచి స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 39 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి రూ. 79 లక్షలు షేర్, రూ. 1.35 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

    బుల్లి నిక్కరుతో సమంత రచ్చ: బాటమ్ నుంచి అందాలన్నీ చూపిస్తూ యమ హాట్‌గా!బుల్లి నిక్కరుతో సమంత రచ్చ: బాటమ్ నుంచి అందాలన్నీ చూపిస్తూ యమ హాట్‌గా!

    9 రోజులకూ కలిపి వచ్చిందెంత?

    9 రోజులకూ కలిపి వచ్చిందెంత?

    తొమ్మిది రోజులు పూర్తయ్యే సరికి ‘డీజే టిల్లు' భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 6.37 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.61 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.16 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 68 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 72 లక్షలు, గుంటూరులో రూ. 66 లక్షలు, కృష్ణాలో రూ. 56 లక్షలు, నెల్లూరులో రూ. 40 లక్షలతో కలిపి రూ. 12.16 కోట్లు షేర్, రూ. 21.22 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.

    వరల్డ్ వైడ్ కలెక్షన్లు రిపోర్టు ఇదే

    వరల్డ్ వైడ్ కలెక్షన్లు రిపోర్టు ఇదే

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ‘డీజే టిల్లు' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 90 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.90 కోట్లు రాబట్టింది. వీటితో కలుపుకుంటే తొమ్మిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 14.96 కోట్లు షేర్‌తో పాటు రూ. 26.40 కోట్లు గ్రాస్ సొంతం అయింది.

    బుల్లి గౌనుతో రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: వామ్మో ఈ హాట్ షో మామూలుగా లేదుగా!బుల్లి గౌనుతో రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: వామ్మో ఈ హాట్ షో మామూలుగా లేదుగా!

    టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

    టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

    యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘డీజే టిల్లు'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ మూవీ 9 రోజుల్లో రూ. 14.96 కోట్లు రాబట్టింది. దీంతో ఇది హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.46 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.

    టాలీవుడ్‌లోనే టాప్ మూవీగా

    టాలీవుడ్‌లోనే టాప్ మూవీగా

    విడుదలకు ముందే భారీ బజ్‌ను ఏర్పరచుకున్న ‘డీజే టిల్లు' మూవీకి ఓవర్సీస్‌లో భారీ స్పందన దక్కుతోంది. దీంతో అక్కడ కలెక్షన్లు కూడా మంచిగానే వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా యూఎస్‌లో హాఫ్ మిలియన్ మార్కును చేరుకుంది. తద్వారా 2022లో ఓవర్సీస్‌లో అత్యధిక గ్రాస్‌ను సొంతం చేసుకున్న తెలుగు సినిమాగా ‘డీజే టిల్లు' రికార్డును క్రియేట్ చేసింది.

    English summary
    Tollywood Young Hero Siddu Jonnalagadda Did DJ Tillu Under Vimal Krishna Direction. This Movie Collect 14.96 Cr in 9 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X