DJ Tillu Business: సౌండ్ మామూలుగా లేదు.. డీజే టిల్లు హిట్టవ్వాలి అంటే ఎంత రావాలంటే?

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన అనేక అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే టైటిల్ సాంగ్ సౌండ్ ఇంటర్నెట్ వరల్డ్ లో మోత మొగిస్త్తోంది. ఇక ట్రైలట్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఊర మాస్ రొమాంటిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమా ఎంత కలెక్ట్ చేస్తే హిట్టయినట్లు లెక్క అనే వివరాల్లోకి వెళితే..

పెరిగిన అంచనాలు

పెరిగిన అంచనాలు

హారిక హాసిని అనుబంధ సంస్థ సీతర ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన డీజే టిల్లు సినిమాపై మొదట్లో అంతగా అంచనాలు లేవు. కానీ సినిమా టీజర్ పోస్టర్లు అలాగే సాంగ్స్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. దీంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ట్రైలర్ తో ఆ డోస్ మరింత ఎక్కువైంది అనే చెప్పాలి. ఇక సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు.

సంక్రాంతికి రావాల్సిన సినిమా..

సంక్రాంతికి రావాల్సిన సినిమా..

డీజే టిల్లు సినిమా అసలైతే గత సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ఆ సమయంలో కొన్ని సినిమాలకు పోటీ ఉండకూడదు అనే ఆలోచనతోనే సినిమాను వాయిదా వేశారు. అంతే కాకుండా థియేట్రికల్ గా క్లాష్ ఉండకూడదు అని కూడా ఆలోచించారు. దిల్ రాజు రౌడి బాయ్స్ సినిమాకు పోటీ ఉండకూడదు అని కూడా డీజే టిల్లు వాయిదా వేసుకున్నట్లు కూడా టాక్ వచ్చింది.

ఓటీటీ ఆఫర్స్ కు టెంప్ట్ అవ్వకుండా..

ఓటీటీ ఆఫర్స్ కు టెంప్ట్ అవ్వకుండా..

ఇక ఓటీటీ పరంగా డీజే టిల్లుకి చాలమంచి ఆఫర్స్ వచ్చాయి. పెట్టిన పెట్టుబడి కంటే కూడా కాస్త ఎక్కువ అమౌంట్ ఇస్తామని రెండు బడా ఓటీటీ సంస్థలు నిర్మాతలతో చర్చలు కూడా జరిపారు. కానీ నిర్మాత నాగవంశీ మాత్రం టెంప్ట్ అవ్వకుండా సినిమాను థియేట్రికల్ గానే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.

ప్రీ రిలీజ్ బిజినెస్..

ప్రీ రిలీజ్ బిజినెస్..

ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డీజే టిల్లు ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో 2.80కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఉత్తరాంధ్ర, ఈస్ట్‌లో కూడా ఈ సినిమా మంచి బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. ఇక వెస్ట్‌లో, గుంటూరు, కృష్ణా, నెల్లూరులో ఇలా ఏపీ తెలంగాణ లో మొత్తంగా రూ. 7.70 కోట్లు వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 0.60కోట్లు, ఓవర్సీస్ లో 0.65కోట్లు, ఇక వరల్డ్ వైడ్ గా 8.95కోట్ల వరకు ధర పలికినట్లు సమాచారం.

Recommended Video

DJ Tillu : No One Can Sing Like Ram Miryala - Sidhu Jonnalagadda | Neha Shetty | Filmibeat Telugu
డీజే టిల్లు..టార్గెట్ ఎంతంటే?

డీజే టిల్లు..టార్గెట్ ఎంతంటే?

ఇక డీజే టిల్లు సినిమాకు గత రెండు మూడు వారాల్లో మంచి బజ్ క్రియేట్ అవ్వడంతో మొత్తానికి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఏపి తెలంగాణలో అనుకున్న దానికంటే ఎక్కువగానే బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద ఈజీగా టార్గెట్ ను ఫీనిష్ చేస్తుందని చెప్పవచ్చు. ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 9.50కోట్లు అందుకుంటే టార్గెట్ ఫినిష్ చేసినట్లు లెక్క. మరి ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X