DJ Tillu OTT: ఆ ఓటీటీలో డీజే టిల్లు.. కలెక్షన్లు వస్తున్న టైంలో ఇలా ఎందుకబ్బా!

ఈ మధ్య కాలంలో తెలుగులో ఫన్ ఎంటర్‌టైనర్ మూవీలు చాలా తక్కువగా వస్తున్నాయి. అందుకే అలా రూపొందిన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయంటే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇలా ఇటీవల అందరి దృష్టినీ ఆకర్షించిన యూత్‌ఫుల్ మూవీల్లో 'డీజే టిల్లు' ఒకటి. చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం వేచి చూస్తోన్న టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన ఈ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అందుకు అనుగుణంగానే దీనికి మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఈ నేపథ్యంలో 'డీజే టిల్లు'ను ఓటీటీలోకి తీసుకు వస్తున్నారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

Recommended Video

DJ Tillu Success Tour|Movie Team Visits Vijayawada Theatre| Siddu, Neha Shetty | Filmibeat Telugu
‘డీజే టిల్లు' రచ్చ అదిరిందిగా

‘డీజే టిల్లు' రచ్చ అదిరిందిగా

సిద్దు జొన్నలగడ్డ - విమల్ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే 'డీజే టిల్లు'. నేహా శెట్టి హీరోయిన్‌గా చేసిన ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్ కంపోజ్ చేయగా.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ప్రిన్స్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు.

భారీగా బిజినెస్.. గ్రాండ్‌గా రిలీజ్

భారీగా బిజినెస్.. గ్రాండ్‌గా రిలీజ్

చాలా ఏళ్లుగా సినిమాలు చేస్తున్న హీరో సిద్దుకు పెద్దగా మార్కెట్ లేదు. అయినప్పటికీ 'డీజే టిల్లు' మూవీ హక్కులకు విపరీతంగా పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్ల బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. అలాగే, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ కూడా అందుకుంటూ సాగుతోంది.

2 వారాలకూ కలిపి వచ్చిందెంత?

2 వారాలకూ కలిపి వచ్చిందెంత?

రెండు వారాలు పూర్తయ్యే సరికి 'డీజే టిల్లు' భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 6.94 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.32 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 76 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 78 లక్షలు, గుంటూరులో రూ. 74 లక్షలు, కృష్ణాలో రూ. 63 లక్షలు, నెల్లూరులో రూ. 44 లక్షలతో కలిపి రూ. 13.41 కోట్లు షేర్, రూ. 23.28 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.

వరల్డ్ వైడ్ కలెక్షన్లు రిపోర్టు ఇదే

వరల్డ్ వైడ్ కలెక్షన్లు రిపోర్టు ఇదే

'డీజే టిల్లు' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 99 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.03 కోట్లు రాబట్టింది. వీటితో కలుపుకుంటే రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 16.43 కోట్లు షేర్‌తో పాటు రూ. 28.82 కోట్లు గ్రాస్ సొంతం అయింది.

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'డీజే టిల్లు'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ మూవీ 2 వారాల్లో రూ. 16.43 కోట్లు రాబట్టింది. దీంతో ఇది హిట్ స్టేటస్‌తో పాటు రూ. 6.93 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.

ఓటీటీలో డీజే టిల్లు స్ట్రీమింగ్

ఓటీటీలో డీజే టిల్లు స్ట్రీమింగ్

ఇప్పటికే పది ఇరవై లక్షల మధ్యలో షేర్‌ను రాబడుతూ సత్తా చాటుతోన్న డీజే టిల్లు మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈ సినిమాను ఆహా వీడియోలో డిజిటిల్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇప్పుడీ నిర్ణయంపై సినీ ప్రియులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X