DJ Tillu 5 Days Collections: 5 రోజుల్లోనే అన్ని కోట్ల లాభం.. డీజే టిల్లు దెబ్బకు రికార్డులు బ్రేక్

2020వ సంవత్సరంలో 'అల.. వైకుంఠపురములో', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టించాయి. అయితే, ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు బిగ్ హిట్లు మాత్రం దక్కలేదు. ఇక, ఈ ఏడాది సంక్రాంతికి ఎన్నో సినిమాలు విడుదలైనా.. ఒక్క 'బంగార్రాజు' మినహా మరో విజయం దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత వారం ఎన్నో అంచనాలతో విడుదలైన చిత్రమే 'డీజే టిల్లు'. రిలీజ్‌కు ముందే భారీ బజ్‌ను ఏర్పరచుకున్న ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా దీనికి పోటెత్తాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా నాలుగు రోజుల్లోనే కంప్లీట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఐదు రోజుల కలెక్షన్లపై లుక్కేద్దాం పదండి!

Recommended Video

DJ Tillu Box Office Collections, ఆ రికార్డు అందుకున్న మొదటి సినిమాగా DJ Tillu | Filmibeat Telugu
‘డీజే టిల్లు'గా సిద్ధు విశ్వరూపం

‘డీజే టిల్లు'గా సిద్ధు విశ్వరూపం

సిద్దు జొన్నలగడ్డ - నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ రూపొందించిన చిత్రమే ‘డీజే టిల్లు'. ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల దీనికి సాంగ్స్ కంపోజ్ చేయగా.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. ప్రిన్స్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

భారీగా బిజినెస్.. గ్రాండ్‌గా రిలీజ్

భారీగా బిజినెస్.. గ్రాండ్‌గా రిలీజ్

చాలా కాలంగా సినిమాల్లో ఉన్నా సిద్దుకు పెద్దగా మార్కెట్ లేదు. అయినప్పటికీ ‘డీజే టిల్లు' మూవీపై అంచనాలు ఉండడంతో హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్ల బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. అలాగే, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన కూడా దక్కుతోంది.

5వ రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత?

5వ రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత?

‘డీజే టిల్లు'కు 5వ రోజూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 51 లక్షలు, సీడెడ్‌లో రూ. 13 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి రూ. 95 లక్షలు షేర్, రూ. 1.55 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

5 రోజులకూ కలిపి వచ్చిందెంత?

5 రోజులకూ కలిపి వచ్చిందెంత?

‘డీజే టిల్లు' మూవీకి ఐదు రోజులకు కలిపి మంచి కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 4.79 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.27 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 87 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 52 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 60 లక్షలు, గుంటూరులో రూ. 48 లక్షలు, కృష్ణాలో రూ. 40 లక్షలు, నెల్లూరులో రూ. 31 లక్షలతో కలిపి రూ. 9.24 కోట్లు షేర్, రూ. 16.25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.

 వరల్డ్ వైడ్ కలెక్షన్లు రిపోర్టు ఇదే

వరల్డ్ వైడ్ కలెక్షన్లు రిపోర్టు ఇదే

‘డీజే టిల్లు' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.68 కోట్లు రాబట్టింది. వీటితో కలుపుకుంటే ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 11.62 కోట్లు షేర్‌తో పాటు రూ. 20.40 కోట్లు గ్రాస్ సొంతం అయింది.

అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన రాశీ ఖన్నా: బాడీ పార్టులు చూపిస్తూ దారుణంగా!
https://telugu.filmibeat.com/heroine/raashi-khanna-sizzling-photos-shakes-internet-107169.html

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?


రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘డీజే టిల్లు'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ మూవీ 5 రోజుల్లో రూ. 11.62 కోట్లు రాబట్టింది. ఫలితంగా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.12 కోట్లు లాభాలతో రికార్డులు నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X