DJ Tillu 6 Days Collections: సినీ పెద్దలకే షాకిస్తోన్న కలెక్షన్లు.. 6 రోజుల్లోనే అన్ని కోట్ల లాభాలు

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రకాల సినిమాలు రూపొందుతూ ఉంటాయి. అయితే, అందులో కేవలం కొన్నింటికి మాత్రమే రిలీజ్‌కు ముందే భారీ హైప్ ఏర్పడుతుంది. దీంతో గ్రాండ్‌గా రిలీజ్ అవడంతో పాటు కలెక్షన్లను కూడా భారీగానే కొల్లగొడుతుంటాయి. అలాంటి వాటిలో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'డీజే టిల్లు' ఒకటి. టీజర్, ట్రైలర్, పాటలతో భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా గత శుక్రవారమే విడుదలైంది. దీనికి అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఈ సినిమా నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుంది. అదే కంటిన్యూ చేస్తూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఆరు రోజుల వసూళ్లను చూద్దాం పదండి!

Recommended Video

DJ Tillu Box Office Collections, ఆ రికార్డు అందుకున్న మొదటి సినిమాగా DJ Tillu | Filmibeat Telugu
 ‘డీజే టిల్లు'గా సిద్ధు అరాచకం

‘డీజే టిల్లు'గా సిద్ధు అరాచకం

సిద్దు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ రూపొందించిన చిత్రమే ‘డీజే టిల్లు'. నేహా శెట్టి ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగ వంశీ దీన్ని నిర్మించాడు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్ కంపోజ్ చేయగా.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. ప్రిన్స్, బ్రహ్మాజీ కీలక పాత్రలు చేశారు.

 భారీగా బిజినెస్.. గ్రాండ్‌గా రిలీజ్

భారీగా బిజినెస్.. గ్రాండ్‌గా రిలీజ్

సుదీర్ఘ కాలంగా సినిమాలు చేస్తున్నా సిద్దుకు పెద్దగా మార్కెట్ లేదు. అయినప్పటికీ ‘డీజే టిల్లు' మూవీపై అంచనాలు ఏర్పడడంతో దీని హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్ల బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. అలాగే, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన భారీగా వస్తోంది.

6వ రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత?

6వ రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత?

6వ రోజూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ‘డీజే టిల్లు'కు మంచి స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 47 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి రూ. 81 లక్షలు షేర్, రూ. 1.40 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

6 రోజులకూ కలిపి వచ్చిందెంత?

6 రోజులకూ కలిపి వచ్చిందెంత?

ఆరు రోజులకు కలిపి ‘డీజే టిల్లు' మూవీకి భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.37 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 95 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 56 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 63 లక్షలు, గుంటూరులో రూ. 52 లక్షలు, కృష్ణాలో రూ. 43 లక్షలు, నెల్లూరులో రూ. 33 లక్షలతో కలిపి రూ. 10.05 కోట్లు షేర్, రూ. 17.65 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.

వరల్డ్ వైడ్ కలెక్షన్లు రిపోర్టు ఇదే

వరల్డ్ వైడ్ కలెక్షన్లు రిపోర్టు ఇదే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ‘డీజే టిల్లు' మూవీకి కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 76 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.75 కోట్లు రాబట్టింది. వీటితో కలుపుకుంటే ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 12.56 కోట్లు షేర్‌తో పాటు రూ. 22.20 కోట్లు గ్రాస్ సొంతం అయింది.

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘డీజే టిల్లు'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ మూవీ 6 రోజుల్లో రూ. 12.56 కోట్లు రాబట్టింది. దీంతో దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 3.06 కోట్లు లాభాలు కూడా సొంతం అయిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X