Tillu Square 10 Days Collections: టిల్లు ఊతకొట్టుడు.. 10 రోజుల్లో కోట్ల సునామీ.. లాభం ఎంతో తెలిస్తే!

టాలీవుడ్‌లోకి చాలా కాలం క్రితమే ఎంట్రీ ఇచ్చి.. విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ. అయితే, ఆరంభంలో పెద్దగా విజయాలను అందుకోలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో 'డీజే టిల్లు'తో హిట్ సాధించాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' అనే సినిమాతో వచ్చాడు. ఈ మూవీకి మొదట్లోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ భారీ స్థాయిలోనే దక్కుతోంది. ఫలితంగా ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'టిల్లు స్క్వేర్' 10 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి!

టిల్లు స్క్వేర్ అంటూ ఎంట్రీ
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన సీక్వెల్ మూవీనే 'టిల్లు స్క్వేర్'. మల్లిక్ రామ్ రూపొందించిన ఈ మూవీలో అనుపమ హీరోయిన్‌గా చేసింది. దీన్ని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ కీలక పాత్రలు చేశారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

Siddu Jonnalagadda Starrer Tillu Square Movie 10 Days Worldwide Collections Details

టిల్లు స్క్వేర్ బిజినెస్ ఇలా
సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్'కు నైజాంలో రూ. 8.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 11.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 22.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 27 కోట్లు బిజినెస్ అయింది.

10వ రోజు భారీ వసూళ్లతో
మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్' సినిమాకు ఆరంభం నుంచీ వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఇలానే పదో రోజు కూడా ఇది సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 2 కోట్లు వరకూ షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 2.50 కోట్లు వరకూ రాబట్టింది. ఇలా 10 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 56 కోట్లు కలెక్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X