Tillu Square 11 Days Collections: టిల్లు వసూళ్ల ఊచకోత.. తెలుగులో మరో రికార్డు.. డబుల్ లాభాలతో సంచలనం

తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ మంది హీరోలు మాత్రమే యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను ఏర్పరచుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఒకడు. ఇప్పటికే చాలా మూవీలు చేసిన అతడు.. 'డీజే టిల్లు'తో బెస్ట్ హిట్ కొట్టాడు. ఈ ఊపులోనే ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' అనే సినిమాతో వచ్చాడు. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ భారీ స్థాయిలో వస్తోంది. ఫలితంగా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'టిల్లు స్క్వేర్' 11 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరే చూడండి!

డబుల్ డోస్‌తో టిల్లు స్క్వేర్
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటించిన సీక్వెల్ మూవీనే 'టిల్లు స్క్వేర్'. మల్లిక్ రామ్ రూపొందించిన ఈ మూవీలో అనుపమ హీరోయిన్‌గా చేసింది. దీన్ని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ కీలక పాత్రలు చేశారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ మ్యూజిక్ ఇచ్చారు.

Siddu Jonnalagadda Starrer Tillu Square Movie 11 Days Worldwide Collections Details

టిల్లు స్క్వేర్ బిజినెస్ ఇలా
సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్' సినిమాకు నైజాంలో రూ. 8.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 11.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 22.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 27 కోట్లు బిజినెస్ జరిగింది.

11వ రోజు ఎంత వచ్చింది?
11వ రోజు 'టిల్లు స్క్వేర్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ డౌన్ అయింది. ఫలితంగా నైజాంలో రూ. 42 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి.. రూ. 91 కోట్లు షేర్, రూ. 1.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

Siddu Jonnalagadda Starrer Tillu Square Movie 11 Days Worldwide Collections Details

11 రోజుల్లో ఎంత వచ్చింది?
'టిల్లు స్క్వేర్'కు 11 రోజుల్లో తెలుగులో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 20.97 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.74 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.02 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.54 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.53 కోట్లు, గుంటూరులో రూ. 2.18 కోట్లు, కృష్ణాలో రూ. 2.00 కోట్లు, నెల్లూరులో రూ. 1.24 కోట్లతో కలిపి.. రూ. 40.22 కోట్లు షేర్, రూ. 66.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 11 రోజుల్లోనే రూ. 40.22 కోట్లు షేర్‌ను వసూలు చేసి సత్తా చాటింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13.02 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 11 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 56.74 కోట్లు షేర్‌తో పాటు రూ. 105 కోట్లు గ్రాస్ వచ్చింది.

Siddu Jonnalagadda Starrer Tillu Square Movie 11 Days Worldwide Collections Details

టార్గెట్ ఇలా.. లాభమెంత?
క్రేజీ స్టోరీతో రూపొందిన 'టిల్లు స్క్వేర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 27 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లోనే దీనికి రూ. 56.74 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌ను అందుకోవడంతో పాటు రూ. 28.74 కోట్లు లాభాలు దక్కించుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X