Tillu Square 13 Days Collections: టిల్లు మరో పెను సంచలనం.. బిజినెస్ కంటే ఎక్కువ లాభం.. 4 కోట్లు వస్తే!
టాలీవుడ్‌లో గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా సీక్వెల్ మూవీలు వస్తున్నాయి. సూపర్ హిట్ అయిన చిత్రాలకు కొనసాగింపుగా వస్తున్న వీటికి మంచి రెస్పాన్స్ రావడంతో మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు. అలా గతంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా భారీ హిట్ కొట్టిన 'డీజే టిల్లు' మూవీకి సీక్వెల్‌గా వచ్చిన చిత్రమే 'టిల్లు స్క్వేర్'.
దీనికి మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ అదిరిపోయేలా వస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు ఎవరూ ఊహించని రీతిలో భారీ వసూళ్లు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'టిల్లు స్క్వేర్' 13 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరే లుక్కేయండి మరి!

లిల్లీతో కలిసి వచ్చేసిన టిల్లు
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటించిన చిత్రమే 'టిల్లు స్క్వేర్'. మల్లిక్ రామ్ రూపొందించిన ఈ సినిమాలో అనుపమ హీరోయిన్‌గా చేసింది. దీన్ని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ కీలక పాత్రలు చేశారు. అచ్చు, రామ్ మిరియాల, భీమ్స్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.
టిల్లు స్క్వేర్ బిజినెస్ ఇలా
సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్' సినిమాకు నైజాంలో రూ. 8.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 11.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 22.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 27 కోట్లు బిజినెస్ జరిగింది.

13వ రోజు ఎంత వచ్చింది?
మల్లిక్ రామ్ దర్శకత్వంలో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' సినిమాకు ఉగాది రోజు రూ. 2 కోట్లకు పైగానే షేర్ వసూలు అయింది. అయితే, 13వ రోజు వర్కింగ్ డే కావడంతో రెస్పాన్స్ సగం కంటే ఎక్కువగానే పడిపోయింది. ఫలితంగా ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 13వ రోజు రూ. 85 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.
13 రోజుల్లో ఎంత వచ్చింది?
13 రోజుల్లో 'టిల్లు స్క్వేర్'కు తెలుగులో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 22.62 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.99 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.36 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.71 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.65 కోట్లు, గుంటూరులో రూ. 2.33 కోట్లు, కృష్ణాలో రూ. 2.13 కోట్లు, నెల్లూరులో రూ. 1.34 కోట్లతో కలిపి.. రూ. 43.13 కోట్లు షేర్, రూ. 71.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 13 రోజుల్లోనే రూ. 43.13 కోట్లు షేర్‌ను వసూలు చేసి సత్తా చాటింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.72 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13.35 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 13 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 60.20 కోట్లు షేర్‌తో పాటు రూ. 108 కోట్లు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. లాభమెంత?
క్రేజీ స్టోరీతో రూపొందిన 'టిల్లు స్క్వేర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 27 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లోనే దీనికి రూ. 60.20 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌ను అందుకోవడంతో పాటు రూ. 32.20 కోట్లు లాభాలు దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











