Tillu Square 14 Days Collections: 28 కోట్లు వస్తేనే హిట్.. 2 వారాల్లో జాక్‌పాట్ వసూళ్లు.. లాభం ఎంతంటే!
సిద్దు జొన్నలగడ్డ.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ కుర్రాడు సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో తనదైన రీతిలో సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్నాడు. దీనికితోడు 'డీజే టిల్లు'తో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. దీంతో ఇటీవలే దీనికి సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' అనే మూవీని చేశాడు. ఈ చిత్రానికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ భారీ స్థాయిలో లభిస్తోంది. ఫలితంగా ఈ మూవీ అదిరిపోయే వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. మరి 'టిల్లు స్క్వేర్' 14 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!
టిల్లు మరోసారి వచ్చేశాడుగా
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ తెరకెక్కించిన చిత్రమే 'టిల్లు స్క్వేర్'. ఈ సినిమాలో అనుపమ హీరోయిన్‌గా చేసింది. దీన్ని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అచ్చు, రామ్ మిరియాల, భీమ్స్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ కీలక పాత్రలు చేశారు.

టిల్లు స్క్వేర్ బిజినెస్ ఇలా
సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్'కు నైజాంలో రూ. 8.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 11.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 22.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 27 కోట్లు బిజినెస్ అయింది.
14వ రోజు కూడా భారీగానే
'డీజే టిల్లు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' సినిమాకు 14వ రోజు రంజాన్ హాలిడే ఉండడంతో రెస్పాన్స్ మరింతగా పెరిగిపోయింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 1.20 కోట్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 1.60 కోట్లు రాబట్టింది. ఇలా ఈ మూవీ 2 వారాల్లో రూ. 61.50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసుకుంది.



Click it and Unblock the Notifications











