Tillu Square 2 Days Collections: టాలీవుడ్‌లో పెను సంచలనం.. 2 రోజుల్లో టిల్లుకు రికార్డు వసూళ్లు
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది కుర్రాళ్లు సుదీర్ఘ కాలంగా సినిమాలు చేస్తున్నారు. అలా కొందరు ఆలస్యంగా హైలైట్ అయి క్రేజ్ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఒకడు. 'డీజే టిల్లు'తో సెన్సేషన్ అయిన అతడు.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభిస్తోంది. ఫలితంగా కలెక్షన్లు అదే రీతిలో వస్తున్నాయి. మరి 'టిల్లు స్క్వేర్' 2 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!
టిల్లు స్క్వేర్‌లో డబుల్ డోస్
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రమే 'టిల్లు స్క్వేర్'. మల్లిక్ రామ్ రూపొందించిన ఈ మూవీలో అనుపమ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ మ్యూజిక్ ఇచ్చారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ తదితరులు నటించారు.

సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్' మూవీకి నైజాంలో రూ. 8.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 11.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 22.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 27 కోట్లు బిజినెస్ జరిగింది.
2వ రోజు ఎంత వచ్చింది?
'టిల్లు స్క్వేర్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 2వ రోజూ భారీ స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 3.97 కోట్లు, సీడెడ్‌లో రూ. 96 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 91 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 38 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 24 లక్షలు, గుంటూరులో రూ. 37 లక్షలు, కృష్ణాలో రూ. 35 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో కలిపి.. రూ. 7.36 కోట్లు షేర్, రూ. 12.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజుల్లో ఎంత వచ్చింది?
'టిల్లు స్క్వేర్'కు తెలుగులో 2 రోజుల్లో హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 8.32 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.15 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.13 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 67 లక్షలు, గుంటూరులో రూ. 93 లక్షలు, కృష్ణాలో రూ. 84 లక్షలు, నెల్లూరులో రూ. 57 లక్షలతో కలిపి.. రూ. 16.61 కోట్లు షేర్, రూ. 25.50 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2 రోజుల్లోనే రూ. 16.61 కోట్లు షేర్‌ను వసూలు చేసి సత్తా చాటింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.10 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 2 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 25.11 కోట్లు షేర్‌తో పాటు రూ. 43.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
ఫుల్ లెంగ్త్ ఫన్ స్టోరీతో రూపొందిన 'టిల్లు స్క్వేర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 27 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లోనే దీనికి రూ. 25.11 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 2.89 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











