Tillu Square 3 Days Collections: సిద్దు హాఫ్ సెంచరీ.. అన్ని కోట్ల టార్గెట్ ఫినీష్.. 5వ మూవీగా రికార్డు
టాలీవుడ్‌లో ఎంతో మంది యంగ్ హీరోలు తమదైన సినిమాలతో సందడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరికి మాత్రమే భారీ ఫాలోయింగ్, మార్కెట్ ఏర్పడ్డాయి. అలాంటి వారిలో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఒకడు. 'డీజే టిల్లు' మూవీతో భారీ హిట్ కొట్టిన అతడు.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' అనే సినిమాను చేశాడు.
దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో దక్కుతోంది. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. మరి 'టిల్లు స్క్వేర్' 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!

మరో లెవెల్ స్టోరీతో వచ్చింది
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ రూపొందించిన చిత్రమే 'టిల్లు స్క్వేర్'. ఈ మూవీలో అనుపమ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ మ్యూజిక్ ఇచ్చారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ కీలక పాత్రలు చేశారు.
టిల్లు స్క్వేర్ బిజినెస్ ఇలా
సిద్దు నటించిన 'టిల్లు స్క్వేర్' సినిమాకు నైజాంలో రూ. 8.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 11.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 22.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 27 కోట్లు బిజినెస్ అయింది.

3వ రోజు ఎంత వచ్చింది?
'టిల్లు స్క్వేర్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజూ భారీ స్పందన పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 4.03 కోట్లు, సీడెడ్‌లో రూ. 93 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 84 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 40 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 25 లక్షలు, గుంటూరులో రూ. 40 లక్షలు, కృష్ణాలో రూ. 39 లక్షలు, నెల్లూరులో రూ. 20 లక్షలతో కలిపి.. రూ. 7.44 కోట్లు షేర్, రూ. 12.25 కోట్లు గ్రాస్ వచ్చింది.
3 రోజుల్లో ఎంత వచ్చింది?
3 రోజుల్లో 'టిల్లు స్క్వేర్'కు తెలుగులో అదిరే రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 12.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.93 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.99 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.53 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 92 లక్షలు, గుంటూరులో రూ. 1.33 కోట్లు, కృష్ణాలో రూ. 1.23 కోట్లు, నెల్లూరులో రూ. 77 లక్షలతో కలిపి.. రూ. 24.05 కోట్లు షేర్, రూ. 37.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 3 రోజుల్లోనే రూ. 24.05 కోట్లు షేర్‌ను వసూలు చేసి సత్తా చాటింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 8.70 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 3 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 34.85 కోట్లు షేర్‌తో పాటు రూ. 63 కోట్లు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. లాభమెంత?
ఫుల్ లెంగ్త్ ఫన్ స్టోరీతో రూపొందిన 'టిల్లు స్క్వేర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 27 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లోనే దీనికి రూ. 34.85కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌ను అందుకోవడంతో పాటు రూ. 6.85 కోట్లు లాభాలు దక్కించుకుంది.
5వ సినిమాగా రికార్డు
సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'టిల్లు స్క్వేర్' సినిమాకు ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్‌ను అందిస్తున్నారు. ఫలితంగా ఈ చిత్రం మూడు రోజుల్లోనే టార్గెట్‌ను ఫినీష్ చేసుకుంది. తద్వారా 2024లో తెలుగులో హిట్ అయిన ఐదో సినిమాగా రికార్డు సాధించింది. డబ్బింగ్ సినిమా 'ప్రేమలు'తో కలుపుకుంటే ఈ ఏడాది ఇది ఆరో హిట్‌గా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











