Tillu Square 4 Days Collections: మండే ఊహించని విధంగా.. 4 రోజుల్లోనే రికార్డు.. లాభమే అన్ని కోట్లా!
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయినా.. సరైన హిట్ కోసం చాలా ప్రయత్నాలు చేశాడు సిద్దు జొన్నలగడ్డ. ఇలా 'డీజే టిల్లు' అనే మూవీతో బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఊపులోనే అతడు దీనికి సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' అనే చిత్రాన్ని చేసి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ సినిమాకు మొదట్లోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ బీభత్సంగా లభిస్తోంది. ఫలితంగా ఈ మూవీకి వసూళ్లు భారీ స్థాయిలో లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'టిల్లు స్క్వేర్' 4 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!
మరో స్టోరీతో వచ్చేసిన టిల్లు
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ - మల్లిక్ రామ్ కాంబోలో వచ్చిన మూవీనే 'టిల్లు స్క్వేర్'. ఈ మూవీలో అనుపమ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ కీలక పాత్రలు చేశారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ మ్యూజిక్ ఇచ్చారు.

టిల్లు స్క్వేర్ బిజినెస్ ఇలా
సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్' సినిమాకు నైజాంలో రూ. 8.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 11.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 22.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 27 కోట్లు బిజినెస్ జరిగింది.
4వ రోజు ఎంత వచ్చింది?
4వ రోజు 'టిల్లు స్క్వేర్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో స్పందన తగ్గింది. ఫలితంగా నైజాంలో రూ. 2.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 44 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 48 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 13 లక్షలు, గుంటూరులో రూ. 20 లక్షలు, కృష్ణాలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలతో కలిపి.. రూ. 3.91 కోట్లు షేర్, రూ. 6.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

4 రోజుల్లో ఎంత వచ్చింది?
'టిల్లు స్క్వేర్'కు 4 రోజుల్లో తెలుగులో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.37 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.47 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.76 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.05 కోట్లు, గుంటూరులో రూ. 1.53 కోట్లు, కృష్ణాలో రూ. 1.41 కోట్లు, నెల్లూరులో రూ. 87 లక్షలతో కలిపి.. రూ. 27.96 కోట్లు షేర్, రూ. 44.60 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 4 రోజుల్లోనే రూ. 27.96 కోట్లు షేర్‌ను వసూలు చేసి సత్తా చాటింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9.85 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 4 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 40.31 కోట్లు షేర్‌తో పాటు రూ. 78 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. లాభమెంత?
ఫుల్ ఫన్ స్టోరీతో రూపొందిన 'టిల్లు స్క్వేర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 27 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లోనే దీనికి రూ. 40.31 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌ను అందుకోవడంతో పాటు రూ. 12.31 కోట్లు లాభాలు దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











